Minister KTR : వేములవాడలో హెల్త్ ప్రొపైల్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్
Minister KTR : మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వేములవాడ పట్టణంలోని తిప్పాపురంలో వంద పడకల ఆస్పత్రిలో మంత్రి కేటీఆర్ హెల్త్ ఫ్రొపైల్ ప్రారంభించారు. అనంతరం ఆస్పత్రి ఆవరణలో ఆక్సిజన్ ట్యాంక్‌కు ప్రారంభోత్సవం చేశారు. సిటీస్కాన్, పల్లియేటివర్ కేర్ సెంటర్,పీఎస్ ఏ ప్లాంట్‌ను మంత్రి జిల్లాకలెక్ట్‌తో కలిసి ప్రారంభించారు. హెల్త్ ఫ్రొపైల్ ద్వారా ప్రమాదం జరిగితే వెంటనే ఏ హాస్పిటల్‌లో చేరినా కంఫ్యూటర్‌లోని రికార్డు ఆధారంగా చికిత్స ప్రారంభించే అవకాశం ఉందన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లెలో 13 లక్షలతో నిర్మించిన పాఠశాల భవనాన్ని, 20లక్షలతోనిర్మించిన పంచాయతీ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. వెంకటాపురం గ్రామంలో రైతు వేదిక, కేసీఆర్ ప్రగతి ప్రాంగణాలను ప్రారంభించారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రగతి పథాన దూసుకుపోతుందన్నారు. రాజన్నసిరిసిల్లజల్లాలో అన్ని గ్రామాలు అభివృద్దిలో ముందున్నాయని అన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com