Minister KTR : అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్‌

KTR (tv5news.in)

KTR (tv5news.in)

Minister KTR : వివిధ రాష్ట్రాలకు చెందిన వారు ఇంగ్లీష్‌కు బదులుగా హిందీయే మాట్లాడాలన్న అమిత్ షా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి కేటీఆర్.

Minister KTR : వివిధ రాష్ట్రాలకు చెందిన వారు ఇంగ్లీష్‌కు బదులుగా హిందీయే మాట్లాడాలన్న అమిత్ షా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి కేటీఆర్. భాషా దురాభిమానం, ఆధిపత్యం బుమారాంగ్‌ అవుతుందంటూ ట్వీట్ చేశారు. రాష్ట్రాల సమాఖ్యే నిజమైన వసుధైక కుటుంబమన్నారు కేటీఆర్. ఏం తినాలో, ఏం వేసుకోవాలో, ఎవరిని ప్రార్థించాలో, ఏ భాష మాట్లాడాలో నిర్ణయించుకునే అధికారం ప్రజలకు ఎందుకివ్వకూడదని ప్రశ్నించారు. తానూ మొదట భారతీయున్నని...తెలంగాణ పౌరుడిగా, తెలుగువాడిగా గర్వపడుతున్నానన్నారు. హిందీని కంపల్సరీ చేయడం, ఇంగ్లీష్‌ను నిషేధించడం విదేశాలకు వెళ్లాలనుకునే యువతకు నష్టం చేస్తుందన్నారు.

Tags

Next Story