KTR : బిర్యానీలో మసాలా రాలేదని మంత్రి కేటీఆర్ కి ట్వీట్
KTR : ట్విట్టర్ లో ఎక్కువగా యాక్టివ్ గా ఉండే మంత్రి కేటీఆర్ కి వింత అనుభవం ఎదురైంది. ఓ వ్యక్తి ఎక్స్ ట్రా మసాలా, లెగ్ పీస్ తో బిర్యానీ కోసం ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టానని, కానీ అవేమీ రాలేవంటూ మంత్రి కేటీఆర్, జోమోటోను ట్యాగ్ చేశాడు. అయితే అతను చేసిన ఈ ట్వీట్‌పై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ విషయంపై తననెందుకు ట్యాగ్ చేశావని మంత్రి కేటీఆర్ విస్మయం వ్యక్తం చేశారు. తన నుంచి ఏం కోరుకుంటున్నావ్ అని సదరు వ్యక్తిని ప్రశ్నించారు. నిమిషాల వ్యవధిలో ఆ ట్వీట్ వైరల్ కావడంతో తన పరువు పోయిందని కాబోలు ఆ యువకుడు తాను చేసిన ట్వీట్‌ను డిలీట్ చేసేశాడు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
And why am I tagged on this brother? What did you expect me to do 🤔🙄 https://t.co/i7VrlLRtpV
— KTR (@KTRTRS) May 28, 2021
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com