Minister KTR : సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి కేటీఆర్ సమీక్ష..!

సిరిసిల్ల జిల్లాలో వ్యవసాయ యోగ్యమైన ప్రతి అంగుళం భూమికి సాగునీరు అందించాలని... మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రగతి భవన్‌లో రాష్ట్ర స్థాయి సాగునీటి శాఖ ఉన్నతాధికారులతో పాటు.. జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన కేటీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టు రాకతో జిల్లాలో భారీ ఎత్తున సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. అయితే మిగిలిపోయిన మిగతా ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా... సాగు లక్ష్యాన్ని పూర్తి స్థాయిలో అందుకోవాలని సూచించారు. సాగునీటి వనరుల అభివృద్ధి కోసం చేపట్టాల్సిన పనులకు సంబంధించిన సూక్ష్మ స్థాయి ప్రణాళికలను సిద్ధం చేయాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు. కొన్ని చెరువుల అభివృద్ధితో పాటు.. అదనంగా కొన్ని చెక్ డ్యాములు నిర్మిస్తే మరింత మెరుగైన ఫలితాలు సాధించవచ్చని... ఎమ్మెల్యేలు అధికారులకు సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com