విద్యార్థులంతా వినూత్నంగా ఆలోచించాలి : కేటీఆర్

విద్యార్థులంతా వినూత్నంగా ఆలోచించాలి : కేటీఆర్
విద్యార్థుల తెలివితేటలను సరైన రీతిలో వినియోగించుకుంటే దేశంలో ఎన్నో అద్భుతా సాధించవచ్చని అన్నారు కేటీఆర్.

తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్‌ 2020 ఛాలెంజ్‌ గ్రాండ్‌ ఫైనల్‌ కార్యక్రమం హైదరాబాద్‌లోని ఎంసీహెచ్‌ఆర్‌డీలో జరిగింది. కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు.. వినూత్న ఆలోచనలతో విద్యార్థులు రూపొందించిన అనేక ప్రాజెక్టులను మంత్రులు పరిశీలించారు.. అనంతరం మంత్రులు మాట్లాడారు.. విద్యార్థుల తెలివితేటలను సరైన రీతిలో వినియోగించుకుంటే దేశంలో ఎన్నో అద్భుతా సాధించవచ్చని అన్నారు.. ఈరోజు అంకుర పరిశ్రమగా ప్రారంభమైనది రేపటి ఎంఎన్‌సీగా ఎదుగుతుందని చెప్పారు.. విద్యార్థులంతా వినూత్నంగా ఆలోచించాలని మంత్రులు పిలుపునిచ్చారు.



Tags

Read MoreRead Less
Next Story