కేసీఆర్‌ను ఇకపై విమర్శిస్తే ఊరుకునేది లేదు : కేటీఆర్

తెలంగాణకు సీఎం కేసీఆర్ లైఫ్ మిషన్ అని... రాష్ట్రం ఏర్పాటు కోసం ఒక్కడిగా బయలుదేరి... తిరుగులేని పోరాటం చేశారన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ జలవిహార్‌లో గ్రేటర్ టీఆర్‌ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. గ్రేటర్ పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. కేసీఆర్ పోరాటం వల్లే టీఆర్‌ఎస్... తిరుగులేని శక్తిగా ఎదిగిందన్నారు. కేసీఆర్ పట్టుదల వల్లే రాష్ట్రం ఏర్పడిందని... తెలంగాణ కోటి ఎకరాల మాగానీగా మారిందన్నారు మంత్రి కేటీఆర్.
సీఎం కేసీఆర్... కాలి గోటికి సరిపోని వారు కూడా నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని మండపడ్డారు మంత్రి కేటీఆర్. పేరుకు ఢిల్లీ పార్టీలు... కానీ అన్నీ సిల్లీ పార్టీలగా మారాయన్నారు. తెలంగాణ పైరులు పచ్చ పడుతుంటే విపక్షాలకు కళ్లు మండుతున్నాయని ఘాటుగా వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ను ఇకపై విమర్శిస్తే ఊరుకునేది లేదన్నారు. కుక్క కాటుకు చెప్పు దెబ్బలు కొట్టినట్టుగానే... ఎవరెన్ని విమర్శలు చేసినా గట్టిగా బధులిస్తామన్నారు మంత్రి కేటీఆర్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com