దేశంలోని అన్ని సమస్యలకు కాంగ్రెస్సే కారణం: మంత్రి కేటీఆర్‌

దేశంలోని అన్ని సమస్యలకు కాంగ్రెస్సే కారణం: మంత్రి కేటీఆర్‌
ప్రతిపక్ష పార్టీలకు మంత్రి కేటీఆర్ మరోసారి కౌంటర్ ఇచ్చారు

ప్రతిపక్ష పార్టీలకు మంత్రి కేటీఆర్ మరోసారి కౌంటర్ ఇచ్చారు. దేశంలోని అన్ని సమస్యలకు కాంగ్రెస్సే కారణమని ఆరోపించారు. ములుగు జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కేటీఆర్.. బీజేపీ, కాంగ్రెస్‌పై మండిపడ్డారు. దశాబ్ది ఉత్సవాలు చేస్తుంటే ఓర్వలేక ఏం సాధించారని కాంగ్రెస్‌ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాటలు నమ్మి మోసపోయి గోస పడొద్దన్నారు. 50 ఏళ్ల పాటు దేశంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ చేసిందేమీ లేదని విమర్శించారు. ఎన్నికలు వస్తేనే బీజేపీ, కాంగ్రెస్‌కు ప్రజలు గుర్తుకు వస్తారన్నారు. బీఆర్ఎస్‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని కేటీఆర్ స్పష్టం చేశారు.

Tags

Next Story