బాధిత కుటుంబాలను అన్నివిధాలుగా ఆదుకుంటాం: మంత్రి కేటీఆర్‌

బాధిత కుటుంబాలను అన్నివిధాలుగా ఆదుకుంటాం: మంత్రి కేటీఆర్‌
ఖమ్మం బాధిత కుటుంబాలను అన్నివిధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు మంత్రి కేటీఆర్. నిన్న ఖమ్మం జిల్లా చీమలపాడులో

ఖమ్మం బాధిత కుటుంబాలను అన్నివిధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు మంత్రి కేటీఆర్. నిన్న ఖమ్మం జిల్లా చీమలపాడులో అగ్నిప్రమాదంతో సిలిండర్‌ పేలి గాయపడి.. నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. కేటీఆర్‌తో పాటు మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ నామా నాగేశ్వర్‌రావు పరామర్శించారు. ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురి కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు కూడా ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు కేటీఆర్. ప్రమాదంలో కుట్ర కోణం ఉందా లేదా అనేది దర్యాప్తులో తేలుతుందన్నారు.

Tags

Next Story