Hyderabad: వరద ప్రభావిత ప్రాంతాల్లో కేటీఆర్ పర్యటన

Hyderabad: వరద ప్రభావిత ప్రాంతాల్లో కేటీఆర్ పర్యటన
ప్రభుత్వ యంత్రాంగం 24గంటలు పనిచేస్తుందని హామీ...

హైదరాబాద్‌ వరద బాధిత ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్‌ పర్యటించారు. అధికారులతో కలిసి హుస్సేన్‌సాగర్‌ వద్ద వరదను పరిశీలించారు. చాదర్‌ ఘాట్‌ చిన్న వంతెన వద్ద మూసి నది ఉధృతిని పరిశీలించారు. అధికారులకు తగు సూచనలు చేశారు. హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉందన్నారు. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌ బృందాలను సిద్ధంగా ఉంచామన్నారు. ప్రభుత్వ యంత్రాంగం 24 గంటలు పనిచేస్తుందని చెప్పారు. గతంలో భారీ వర్షాలు పడితే అనేక ప్రాంతాలు జలమయం అయ్యేది.. అయితే ఈసారి నాలా డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం ద్వారా చేపట్టిన కార్యక్రమాలతో వరద ప్రభావం కొంత తగ్గిందన్నారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఆయా ప్రాంతాల్లో వరద సమస్య పెద్దగా లేదన్నారు. హైదరాబాద్‌లో డిసిల్టింగ్ కార్యక్రమాన్ని ఎప్పుడో పూర్తి చేస్తామన్నారు. దీంతోపాటు చెరువుల బలోపేతం చేసే కార్యక్రమాలు కూడా చేపట్టామని..135 చెరువులకు గేట్లు బిగించామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

వర్షాలను రాజకీయం చేయడం సరికాదన్నారు మంత్రి కేటీఆర్‌. విపత్కర పరిస్థితుల్లో చైతనేనే విపక్షాలు సాయం చేయాలి కానీ.. ప్రభుత్వ ఉద్యోగుల మానసిక స్థైర్యం దెబ్బతినేలా చిల్లర విమర్శలు చేయొద్దని హితవు పలికారు. ప్రభుత్వంలోని అన్ని శాఖలు వర్షాన్ని ఎదుర్కొనేందుకు పనిచేస్తున్నాయని చెప్పారు. వారి మనో ధైర్యం కలిగించేలా నాయకులు మాట్లాడితే బాగుంటుందని సూచించారు.

అంతకుముందు భారీ వర్షాలపై మంత్రి కేటీఆర్‌ మున్సిపల్‌ శాఖ అధికారులు. అడిషనల్‌ కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రాణ నష్టం జరగకుండా చూడడమే ప్రాథమిక ప్రాధాన్యతగా పని చేయాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులపైన అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద నీరు నిలిచిన పట్టణాల్లో మరిన్ని సహాయక చర్యలు చేపట్టాలన్నారు. శిథిల భవనాల నుంచి జనాలను వెంటనే తరలించాలని మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. భారీ వర్షాలపై సీఎం కేసీఆర్‌ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని చెప్పారు.. మున్సిపల్‌ అధికారులతోనూ సీఎం ప్రత్యేకంగా మాట్లాడారని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story