ఇంటింటికి మంచినీరు అందిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుంది : మంత్రి కేటీఆర్

ఇంటింటికి మంచినీరు అందిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుంది : మంత్రి కేటీఆర్
ఇంటింటికి మంచినీరు అందిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో పర్యటించిన కేటీఆర్..

ఇంటింటికి మంచినీరు అందిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో పర్యటించిన కేటీఆర్.. మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్‌ను ప్రారంభించారు. తెలంగాణ వచ్చాక పాలమూరు జిల్లా ఎంతో అభివృద్ధి చెందుతోందని చెప్పారు. అన్ని వర్గాల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్సే అని చెప్పారు. పని చేసే టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజల ఆశీర్వాదం ఉంటే మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు.

తొలుత హౌసింగ్ బోర్డు కాలనీలో మంత్రులతో కలిసి అభివృద్ధి పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం కావేరమ్మపేటలో డబుల్‌ బెడ్‌రూమ్ ఇళ్లను పరిశీలించారు. అంతకుముందు రంగారెడ్డి జిల్లా కొత్తూరులో పర్యటించిన మంత్రి కేటీఆర్.. నూతన మున్సిపాలిటీ భవనానికి శంకుస్థాపన చేశారు. కేటీఆర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు టీఆర్ఎస్‌లో చేరారు. పార్టీ కండువా కప్పి వారిని టీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు మంత్రి కేటీఆర్

Tags

Read MoreRead Less
Next Story