Malla Reddy : రేవంత్‌ రెడ్డి నన్ను చంపాలని కుట్ర పన్నారు : మంత్రి మల్లారెడ్డి

Malla Reddy : రేవంత్‌ రెడ్డి నన్ను చంపాలని కుట్ర పన్నారు : మంత్రి మల్లారెడ్డి
X
Malla Reddy : రెడ్డి సింహగర్జన సభలో జరిగిన ఘటనపై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. రెడ్డి ముసుగులో తనపై దాడి జరిగిందన్నారు.

Malla Reddy : రెడ్డి సింహగర్జన సభలో జరిగిన ఘటనపై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. రెడ్డి ముసుగులో తనపై దాడి జరిగిందన్నారు. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ తనను చంపాలని కుట్ర పన్నారని ఆరోపించారు. గూండాలతో దాడులు చేయించారని.. దాడులకు దిగిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.

పక్కా పథకం ప్రకారమే తనపై దాడి చేశారన్నారు మల్లారెడ్డి. రెడ్డి కార్పొరేషన్‌ కోసం ప్రభుత్వం సుముఖంగా ఉందన్నారు. మీటింగ్‌ తర్వాత సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్దామనుకున్నామని చెప్పారు. ప్రభుత్వం తరఫున హామీ ఇద్దామనే వెళ్లానన్నారు.

ఇంతలో ప్రభుత్వ పథకాల గురించి చెప్పే లోపే దాడి చేశారన్నారు. ఇక.. రెడ్డి సింహగర్జన సభకు తానే పర్మిషన్‌ ఇప్పించానని వెల్లడించారు. ఈ దాడులతో రెడ్డి వర్గానికి సంబంధం లేదన్నారు.

Tags

Next Story