Malla Reddy: రేవంత్ రెడ్డి ఓ దొంగ, రాహుల్‌గాంధీ ఓ తోపు: మల్లారెడ్డి

Malla Reddy: రేవంత్ రెడ్డి ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి మల్లారెడ్డి. రేవంత్ రెడ్డి ఓ దొంగ, రాహుల్‌గాంధీ ఓ తోపు అంటూ విరుచుకుపడ్డారు. రేవంత్ చేసేదంతా బ్లాక్ మెయిల్ రాజకీయాలేనని, తన కాలేజీలు మూయిస్తానని బెదిరించారని ఆరోపించారు. ఎన్నో ఏళ్ల నుంచి రేవంత్ రెడ్డి తనను ఇబ్బంది పెడుతున్నారని, టీడీపీలో ఉన్నప్పటి నుంచే రేవంత్‌రెడ్డితో తనకు గొడవలు ఉన్నాయన్నారు మంత్రి మల్లారెడ్డి.
రేవంత్ రెడ్డి కూతురు పెళ్లి తన డబ్బులతోనే జరిగిందని, డబ్బులిచ్చి పీసీసీ పదవి తెచ్చుకున్నారని, తాను చెప్పేది అబద్దమని యాదాద్రిలో ప్రమాణం చేసి చెప్పగలరా అని సవాల్ విసిరారు. రేవంత్ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ మటాష్ అవుతుందన్న మల్లారెడ్డి.. రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్లడం ఖాయమని చెప్పుకొచ్చారు. సొంతపార్టీలో సీనియర్లను రేవంత్‌రెడ్డి ఉండనివ్వరని, భట్టి, ఉత్తమ్, జానారెడ్డి అమాయకులని మాట్లాడారు. రేవంత్ రెడ్డికి అన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో సమాధానం చెప్పాలన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com