సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన మంత్రి మల్లారెడ్డి ఆడియో..!

ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి మంత్రి మల్లారెడ్డి ఫోన్‌లో వార్నింగ్ ఇస్తున్న ఆడియో సంచలనంగా మారింది.. మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలంలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంచర్ వేస్తుండగా, అందులో వాటా కావాలంటూ మంత్రి మల్లారెడ్డి బెదిరింపులకు గురిచేశారు.. దానికి సంబంధించిన ఆడియో బయటికొచ్చింది..
మంత్రి మల్లారెడ్డి ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ రియల్టర్‌ను డబ్బుల కోసం మంత్రి దిరించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వెంచర్‌కు సంబంధించి మామూళ్లు సర్పంచ్‌కి ఇస్తే మాకు ఇవ్వవా అంటూ మల్లారెడ్డి దబాయించారు. ఓ వెంచర్ విషయంలో రియ ల్ఎస్టేట్ వ్యాపారిని మల్లారెడ్డి బెదిరించినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ శివారు శామీర్‌పేట మండలం బొమ్మరాజుపేటలో వివాదం నెలకొంది. వాటా ఇవ్వకపోతే... 67 ఎకరాల వెంచర్‌ను ఆపిస్తానంటూ మల్లారెడ్డి బెదిరించారు. వాటా ఇచ్చే వరకూ వెంచర్ ఆపాల్సిందేనంటూ హుకుం జారీ చేశారు.
సర్పంచ్‌లకు మాత్రమే వాటాలు ఇస్తే సరిపోతుందా..? ఇక్కడ ఎమ్మెల్యే, మంత్రులు ఉన్నారు.. వీరికి ఇవ్వరా అంటూ డిమాండ్ చేస్తూ ఉండడం గమనార్హం. 'కలెక్టర్‌కు చెప్పి పొట్టు పొట్టు చేయిస్తాం.. ఏమైనా బిచ్చమెత్తుకోవాల్నా..' అంటూ బెదిరించారు. అయితే, వెంచర్ వేస్తున్న వ్యక్తికి యాక్సిడెంట్ అయిందని, అతను ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్నాడని అవతలి వ్యక్తి చెప్పగా.. అప్పటి వరకూ వెంచర్‌ను ఆపేయండి' అంటూ వార్నింగ్ జారీ చేస్తున్నట్లు ఆడియో టేపులో ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com