వచ్చే నెల 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం - మంత్రి సబితా
17 నెలలుగా అన్ని వ్యవస్థలు అతలాకుతలమయ్యాయన్నారు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. కరోనా తగ్గుముఖం పట్టడంతో సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు సెప్టెంబరు 1 నుంచి విద్యాసంస్థలు పునః ప్రారంభిస్తామన్నారు. 60 లక్షల మంది పిల్లలు స్కూళ్లకు రాబోతున్నారని తెలిపారు. అంగన్‌వాడీ సంస్థలు కూడా ప్రారంభించాలని నిర్ణయించామన్నారు. మిడ్ డే మీల్స్‌పై కూడా జాగ్రత్తలు పాటించాలని సూచించామని... అలాగే వాహనాలను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలని ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యానికి సూచించినట్లు మంత్రి సబితా తెలిపారు.
విద్యాసంస్థలు తెరవడంపై అన్ని జిల్లాల అధికారులు, రాజకీయ నాయకులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించామని... అందరూ సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని అభినందిస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. ఈనెల 30లోపు స్కూళ్లు సిద్ధం చేయాలని.. లేదంటే చర్యలు తప్పవన్నారు. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే.. వెంటనే టెస్ట్ చేయాలని మంత్రి ఎర్రబెల్లి... అధికారులకు సూచించారు. పల్లె, పట్టణ ప్రగతి మాదిరిగా... విద్యాసంస్థలను శానిటైజ్ చేయడం కూడా నిరంతర ప్రక్రియగా జరుగుతుందన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com