Minister Seethakka: సర్పంచ్ ఎన్నికలపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు

Minister Seethakka: సర్పంచ్ ఎన్నికలపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు
ఇప్పట్లో ఎన్నికలు కష్టమే...

ఇప్పట్లో సర్పంచుల ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రతినెల ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని మంత్రి సీతక్క కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని.....ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదలు అందజేశారు.

ఆయలం వెలుపల మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ సర్పంచుల ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించడం వీలుకాదన్నారు. ప్రతినెల మొదటి వారంలోనే ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారంటీలను అమలుచేసి తీరుతామని స్పష్టం చేశారు.

గత పాలకులు పదేండ్లపాటు సామాజిక మాధ్యమాల్లో ఉన్నది లేనట్టుగా చూపి కాలం గడిపారని విమర్శించారు. అందుకే ప్రజలు వారిని తిరస్కరించి తమకు అధికారం కట్టబెట్టారని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు వస్తున్న ప్రజా ఆదరణను చూసి ఓర్వలేక మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తప్పుడు మాటలను ప్రజలు ఇక నమ్మని పరిస్థితి వచ్చిందని, సోషల్‌ మీడియాలో తప్పుడు ఆరోపణలు చేస్తే ప్రజలు గమనిస్తున్నారని వెల్లడించారు. సర్పంచుల వేల బిల్లులు పెండింగ్ పట్టిందెవరుని ప్రశ్నించారు. తాము సక్రమంగా పని చేస్తేనే మళ్లీ అధికారం ఇస్తారు, చేయకపోతే అవకాశం ఇవ్వరని తెలిపారు.

వేములవాడ రాజన్న తమ ఇలవేల్పని, కుటుంబ సమేతంగా వచ్చి దర్శనం చేసుకుంటామన్నారు. ఆదివాసి కుటుంబంగా మాకు ఆనవాయితీ ఉంది.. సమ్మక్క జాతరకు ముందు వచ్చి దర్శించుకుంటాని చెప్పారు. రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేయడంలో గత ప్రభుత్వం వివక్ష చూపిందని విమర్శించారు. తొందర్లోనే స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమవుతారని చెప్పారు.

మన ఆచారాలు, సాంప్రదాయాలుకు అనుగుణంగా దేవుళ్లను కొలుచుకుంటాం, కానీ కొందరు ఈ దేవుళ్లనే కొలవాలని చెబుతూ వాటిని ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మన సంస్కృతి సాంప్రదాయాలను చరిత్రను కాపాడుకొని భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story