అందరి సౌఖ్యమే సీఎం లక్ష్యం: మంత్రి తలసాని

అందరి సౌఖ్యమే సీఎం లక్ష్యం: మంత్రి తలసాని
చంద్రాయణ గుట్ట నియోజక వర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

హైదరాబాద్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పర్యటించారు. చంద్రాయణ గుట్ట నియోజక వర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు మంత్రి. దాదాపు 10కోట్ల రూపాయలతో లాల్‌ దర్వాజ సింహవాహిని అలయాన్ని అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. నియోజక వర్గంలో నాలుగు మల్టీపర్పస్‌ ఫంక్షన్ హాళ్లను నిర్మించనున్నట్లు తలసాని తెలిపారు. సంస్కృతి,సంప్రదాయాల పరిరక్షణకు ప్రభుత్వం కృషిచేస్తుందని, తెలంగాణ ఏర్పడ్డాక అత్యంత ఘనంగా బోనాల ఉత్సవాలు జరుపుకుంటున్నామని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలనేదే కేసీఆర్‌ లక్ష్యమన్న తలసాని ప్రజల మధ్య కొందరు విబేధాలు సృష్టిస్తున్నారని అన్నారు.

Tags

Next Story