KTR : మనఊరు-మనబడి కార్యక్రమంలో ఎన్నారైలు భాగస్వాములు కావాలి: మంత్రి కేటీఆర్

KTR :  మనఊరు-మనబడి కార్యక్రమంలో ఎన్నారైలు భాగస్వాములు కావాలి: మంత్రి కేటీఆర్
KTR : మన ఊరు-మన బడి కార్యక్రమంలో ఎన్నారైలు భాగస్వాములు కావాలన్నారు మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి.

KTR : మన ఊరు-మన బడి కార్యక్రమంలో ఎన్నారైలు భాగస్వాములు కావాలన్నారు మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి. ప్రభుత్వం చేపట్టిన మన ఊరు- మన బడి కార్యక్రమంపై ఎన్నారైలతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత విద్యా రంగంలో అనేక మార్పులు తీసుకువచ్చామని, ప్రాథమిక పాఠశాల నుంచి మొదలుకొని మహిళలకు ప్రత్యేక డిగ్రీ కాలేజీల వరకు నూతనంగా వందలాది విద్యాసంస్థలను ఏర్పాటు చేశామన్నారు. లక్షలాది మంది విద్యార్థులకు అత్యుత్తమ సౌకర్యాలతో విద్యను అందిస్తున్నామని, వాటికి సంబంధించిన ఫలాలు అందుతున్న విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకులాలు, వాటి ద్వారా విద్యార్థులు సాధిస్తున్న విజయాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు.

నూతన విద్యా సంస్థల ఏర్పాటుతో పాటు తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసి అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే మన ఊరు - మన బడి కార్యక్రమం చేపట్టిందన్నారు మంత్రి కేటీఆర్. ఈ కార్యక్రమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 7వేల 289 కోట్లతో దాదాపు 26 వేల ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రోగ్రామ్‌ను కేవలం ప్రభుత్వ కార్యక్రమంలా కాకుండా ప్రజల భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్లాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి ఇతర దేశాలకు వెళ్లిన తెలంగాణ బిడ్డల భాగస్వామ్యాన్ని కోరుతున్నట్లు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. పాఠశాల అభివృద్ధికి కోటి రూపాయలు లేదా అంతకు మించి ఇస్తే.. ఆ పాఠశాలకు వాళ్లు సూచించిన పేరు పెడతామన్నారు. పది లక్షల రూపాయలు లేదా అంతకు మించి ఆర్థిక సహకారం అందిస్తే క్లాస్ రూమ్‌కి వారు సూచించిన పేరు పెడతామని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story