పొరపాటున జరిగింది.. క్షమించండి: తలసాని

ఎవరూ చూడట్లేదనుకుంటాం కానీ, ఎన్నో కళ్లు మనల్ని గమనిస్తుంటాయి. స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన గొడవకు పశుసంవర్ధక శాఖ మంత్రి శ్రీనివాస్ యాదవ్ క్షమాపణలు చెప్పారు. బాధితుడు భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్‌కుమార్‌బాబుగా గుర్తించారు. మంత్రి శ్రీనివాస్‌యాదవ్ తనకు క్షమాపణ చెప్పినట్లు పేర్కొన్నారు.
మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేరుతో ఇందిరాపార్కు వద్ద నిర్మించిన స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం సందర్భంగా కొంత తొక్కిసలాట జరిగింది. మంత్రి కేటీఆర్‌తో కలిసి రాజేష్‌కుమార్‌బాబు వెళుతున్నారు. ఈ క్రమంలో తలసాని కాలు తొక్కడం జరిగింది. అది ఎవరో గమనించుకోకుండా తలసాని ఆయనను కొట్టడానికి ప్రయత్నించారు. దాంతో అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వీడియోలో, శ్రీనివాస్ యాదవ్ ఒక వ్యక్తిని పక్కకు నెట్టడం, అతనిని చెంపదెబ్బ కొట్టడానికి చేయి పైకెత్తడం కనిపిస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కనిపించిన వెంటనే, అది క్షణాల్లో వైరల్‌గా మారింది. దీంతో మనస్థాపం చెందిన మంత్రి శ్రీనివాస్ యాదవ్ క్షమాపణలు కోరుతూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. ఈ వివాదానికి ఇంతటితో తెర దించమని నెటిజన్లను కోరారు.
"ఆ ప్రత్యేక రోజున, పెద్ద సంఖ్యలో జనం గుమిగూడింది. దాని మధ్యలో, అతను తెలియకుండా నా కాలు మీద అడుగు పెట్టినప్పుడు నేను అతడిని నెట్టాను. నా కాలు తొక్కడంతో రక్తస్రావం అయింది అని మంత్రి చెప్పారు. క్లిప్ కావాలని ప్రచారం చేస్తున్నారని, తన చర్య వల్ల ఎవరి మనోభావాలు అయినా దెబ్బతిని ఉంటే క్షమాపణలు చెబుతున్నానని తలసాని తెలిపారు. తెలంగాణలో సేవాలాల్, కొమురం భీం జయంతి వేడుకల్లో తాను నిత్యం పాల్గొంటానని మంత్రి ఉద్ఘాటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com