పుట్టింటికి వెళ్తానని చెప్పిన తల్లి సహా ఇద్దరు పిల్లలు అదృశ్యం

X
హైదరాబాద్ కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని తల్లి సహా ఇద్దరు పిల్లలు అదృశ్యమయ్యారు. మూసాపేట్ - రాజీవ్ నగర్‌లో నివాసముండే మానస, ఇద్దరు పిల్లలు కనిపించడంలేదు. గురువారం మధ్యాహ్నం తన పుట్టింటికి వెళ్తానని చెప్పి పిల్లలతో వెళ్లిన మానస.. కనిపించడంలేదని బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఫోన్ కూడా స్విచాఫ్ చేసి ఉండటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. రెండు రోజులు గడుస్తున్నా.. ముగ్గురి ఆచూకీ లభ్యం కాలేదు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
