TG: మిస్సింగ్ కేసుల ఛేదనలో 94 శాతం సక్సెస్ రేట్‌

TG: మిస్సింగ్ కేసుల ఛేదనలో  94 శాతం సక్సెస్ రేట్‌
X
97 వేల మందికిపైగా కేసులను ట్రేస్ చేసిన తెలంగాణ పోలీసులు.. డీజీపీ కార్యాలయం లిఖితపూర్వక సమాధానం

తెలంగాణలో ప్రతి రోజు ఎంతో మంది అదృశ్యమవుతున్నారు. పోలీసులు కొంతమంది ఆచూకీ కనుగొన్నప్పటికీ మరికొంత మంది ఆచూకీ లభించటం లేదు. తెలంగాణలో గత నాలుగేళ్లలో 1,03,496 మంది కనిపించకుండాపోగా, రాష్ట్రవ్యాప్తంగా 96,614 మిస్సింగ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో 97,028 ఆచూకీ కనిపెట్టారు. నాలుగేళ్లలో తెలంగాణలో 6,468 మంది కనిపించకుండా పోయారు. రాష్ట్ర వ్యాప్తంగా మిస్సింగ్‌ కేసుల వివరాలపై యాత్‌ ఫర్‌ యాంటీ కరెప్షన్‌ సంస్థ ఆర్టీఐ కింద అడిగిన ప్రశ్నకు తెలంగాణ డీజీపీ కార్యాలయం లిఖిత పూర్వక సమాధానం ఇచ్చింది.

మిస్సింగ్ కేసులు ఇలా..

సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోనే అధిక మిస్సింగ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఈ ప్రాంతంలోనే ఆచూకీ దొరకకుండా పోయినవారి సంఖ్య అధికంగా ఉంది. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 95 మంది బాలికలు, 55 మంది బాలురు, 554 మంది మహిళలు, 920 పురుషుల ఆచూకీ నేటికీ లభించలేదు. 2024 ఏడాదిలో అక్టోబర్‌ వరకు మొత్తం 20,403 మంది అదృశ్యమయ్యారు. ఇందులో 17,054 మందిని పోలీసులు పట్టుకోగా, మిగతా 3,349 మంది ఆచూకీ ఇంకా దొరకలేదు. భూపాలపల్లిలో జిల్లా పరిధిలో ఒక్క కేసు మాత్రమే నమోదు కాగా, ఈ కేసును ట్రేస్ చేశారు. అదిలాబాద్‌లో 60 కేసులు నమోదు కాగా, అన్ని కేసులను ట్రేసింగ్ చేశారు. సూర్యాపేట పరిధిలో 109 కేసులు నమోదు కాగా, అన్ని ట్రేస్ చేశారు.

ఏ వయసుల వారు ఎంతమంది మిస్ అయ్యారంటే

18 ఏళ్లలోపు మిస్సింగ్ అయిన అబ్బాయిలు 5,750 మంది

దొరికిన వారు - 5,455

దొర‌క‌ని వారు - 295

18 ఏళ్లలోపు మిస్సింగ్ అయిన అమ్మాయిలు 8,359 మంది

దొరికిన వారు - 7,970

దొర‌క‌ని వారు - 389

మిస్సింగ్ అయిన మ‌హిళ‌లు 54,744 మంది

దొరికిన వారు - 52,312

దొర‌క‌ని వారు - 2432

మిస్సింగ్ అయిన పురుషులు 34,643 మంది

దొరికిన వారు - 31,291

దొర‌క‌ని వారు - 3,352

Tags

Next Story