‘ఈ పిల్లగాడిని మిస్సవుతున్నా’.. మంత్రి కేటీఆర్

‘ఈ పిల్లగాడిని మిస్సవుతున్నా’.. మంత్రి కేటీఆర్
కొడుకు ఎంత పెద్దవాడైనా తండ్రికి ఎప్పుడూ చిన్నావాడే.. తన కళ్ల ముందు పెరిగిన తనకంటే అన్నింటా ముందుండాలని ప్రతి తండ్రీ కోరుకుంటాడు.

కొడుకు ఎంత పెద్దవాడైనా తండ్రికి ఎప్పుడూ చిన్నావాడే.. తన కళ్ల ముందు పెరిగిన తనకంటే అన్నింటా ముందుండాలని ప్రతి తండ్రీ కోరుకుంటాడు. తెలంగాణ మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షును ఉన్నత చదువుల కోసం విదేశాలకు పంపించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎంత బిజీగా ఉన్నా దూరంగా ఉన్న కొడుకు గుర్తుకు వచ్చి మిస్సవుతున్న ఫీలింగ్ ని పంచుకున్నారు సోషల్ మీడియా వేదికగా.

కొడుకు హిమాన్షుతో వాకింగ్ చేస్తున్న ఫోటోను పంచుకుంటూ.. ఈ పిల్లగాడిని మిస్సవుతున్నా అని ట్వీట్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న అమెరికా వెళ్లిన కొడుకును గుర్తు చేసుకున్నారు.

గచ్చిబౌలిలోని ఓక్రిడ్జ్ స్కూల్ లో చదువుకున్న హిమాన్షు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు.. అప్పుడు భార్య శైలిమ, తాను కలిసి వెళ్లి కొడుకుని జాయిన్ చేసి వచ్చారు.. అప్పుడు కూడా ట్వీట్ చేస్తూ.. హిమాన్షు అమెరికాకు ఒంటరిగా వెళ్లడం లేదని అతనితో పాటు తనలోని కొంత భాగాన్ని కూడా తీసుకొని వెళ్తున్నాడని మంత్రి పేర్కొన్నారు.

Tags

Next Story