Jagga Reddy : నేనే రేవంత్‌కు ఝలక్ ఇస్తా: జగ్గారెడ్డి

Jagga Reddy : సోనియా కుటుంబం, కాంగ్రెస్ అధిష్టానంతో తనకూ ఎలాంటి ఇబ్బంది లేదన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. పంచాయితీ అంతా రేవంత్ తీరుతోనే అన్నారు. రేవంత్ మెదక్ పర్యటనకు వెళ్తే పిలవకపోవడంతో కోపం వచ్చిందన్నారు. సోనియా గాంధీ నియమించిన ఏ వ్యక్తితోనైనా కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని స్పష్టం చేశారు.అధిష్టానం నుంచి పిలుపు వస్తే ఢిల్లీ వెళ్తానన్నారు. రేవంత్‌పై విమర్శలు చేసినంత మాత్రాన పదవి తొలగించడం సరికాదన్నారు. సోనియాను బలి దేవత అన్న రేవంత్‌కు పీసీసీ ఇవ్వలేదా అంటూ ఎదురు ప్రశ్నించారు. ఏ ఆలోచన లేని శ్రీధర్ బాబు పైనా ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. తన కూతురు పని మీదనే వీహెచ్ హరీష్ రావును కలిశారని స్పష్టం చేసారు జగ్గారెడ్డి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com