MLA: మారణ హోమం మంచిదికాదు: ఎమ్మెల్యే

శాంతి చర్చలకు సిద్దమని మావోయిస్టులు పదేపదే ప్రతిపాదిస్తున్నప్పటికీ కర్రెగుట్టలో కూంబింగ్ నిర్వహించడం సమంజసం కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అభిప్రాయపడ్డారు. తక్షణమే కర్రెగుట్ట అడవులలో కూంబింగ్ నిలిపివేయాలని, మావోయిస్టులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలకు అంగీకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. వేలాది మంది సాయుధ బలగాలు చుట్టుముట్టి మావోయిస్టులను నిర్మూలించడమే లక్ష్యంగా మారణహోమం చేయడం సరైన చర్య కాదన్నారు. అణచివేత ఒక్కటే మార్గం కాదని వాటిని చర్చల ద్వారా పరిష్కరించాలని కోరారు. తాము శాంతి చర్చలకు సిద్దమని మావోయిస్టులు మరోసారి చేసిన ప్రతిపాదనను పెడచెవిన పెట్టడం శ్రేయస్కరం కాదని సూచించారు.
చర్చలు జరపాలి
ఇక, అణచివేత ఒక్కటే మార్గం కాదని వాటిని చర్చల ద్వారా పరిష్కరించాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. తాము శాంతి చర్చలకు సిద్దమని మావోయిస్టులు మరోసారి చేసిన ప్రతిపాదనను పెడచెవిన పెట్టడం శ్రేయస్కరం కాదని సూచించారు. ఇప్పటికే మావోయిస్టులు పదుల సంఖ్యలో హతమైనట్లు వార్తలు వస్తున్నాయి.. అలాగే, సాయుధ బలగాలు వడదెబ్బకు గురైనట్లు సమాచారం వస్తుంది.. వీటన్నింటిని పరిగణలోకి తీసుకోవాలని కూనంనేని విజ్ఞప్తి చేశారు.
పేదల పక్షాన పోరాడుతాం
కమ్యూనిస్టు పార్టీ పేదల పక్షాన పోరాడుతుందన్నారు. దేశ ప్రజలను చైతన్య పరిచే శక్తి ఉందన్నారు. అధికారం శాశ్వతం కాదని ప్రజల పక్షాన పనిచేయడమే అతిగొప్ప అధికారమన్నారు. సీపీఐ సిటీ కార్యదర్శి ఎస్కే జానిమియా అధ్యక్షతన జరిగిన సభలో సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు, జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్, రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ మహ్మద్ మౌలానా తదితరులు పాల్గొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com