Raja Singh Arrest : రాజా సింగ్ మళ్లీ అరెస్ట్..

Raja Singh Arrest : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్టుతో ఆయన ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.. పాత కేసుల్లో ఆయన్ను అరెస్టు చేశారు మంగళ్‌హాట్ పోలీసులు.. ఫిబ్రవరి, ఏప్ఇరల్‌లో షాహినాత్ గంజ్, మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసులు నమోదయ్యాయి.. ఆ కేసులకు సంబంధించి 41 సీఆర్పీసీ కింద రాజాసింగ్‌కు నోటీసులు ఇచ్చారు.. 24 గంటల్లో సమాధానం చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు.. అయితే, కొద్దిసేపటి క్రితం రాజాసింగ్ నివాసానికి వెళ్లిన మంగళ్‌హాట్ పోలీసులు.. అక్కడే ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.. రాజాసింగ్ అరెస్టు సందర్భంగా పెద్ద ఎత్తున బలగాలు మోహరించాయి..
భారీ భద్రత నడుమ రాజాసింగ్‌ను వ్యాన్‌లో తీసుకెళ్లారు.. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ఆయన అనుచరులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి కనిపించింది.. ఇంటి నుంచి నేరుగా ఆయన్ను గాంధీ ఆస్పత్రికి తరలించారు.. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి సికింద్రాబాద్ కోర్టుకు తరలించారు..
పాత కేసుల్లో రాజాసింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. మంగళ్‌హాట్ పీఎస్‌లో 68/2022 క్రైమ్ నంబర్ కేసులో ఇప్పటికే ఆయనకు నోటీసులు ఇచ్చారు.. సెక్షన్ 502(2), 171-సీ రెడ్‌విత్, 171ఎఫ్, 123, 125 ఆర్పీ యాక్ట్ కింద రాజాసింగ్‌పై కేసులున్నాయి.. అలాగే షా ఇనాత్ గంజ్ పీఎస్ క్రైమ్ 71/2002 కేసులోనూ పోలీసులు నోటీసులు ఇచ్చారు.. 153(ఏ), 295 (ఏ), 504, 505/2 సెక్షన్ల కింద రాజాసింగ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు ఇంటికి వెళ్లి అరెస్టు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com