BRS: ప్రగతి భవన్‌కు స్టేషన్‌ ఘన్‌పూర్ పంచాయతీ

BRS: ప్రగతి భవన్‌కు స్టేషన్‌ ఘన్‌పూర్ పంచాయతీ
X

స్టేషన్‌ ఘన్‌పూర్ బీఆర్‌ఎస్‌ నాయకుల పంచాయతీ ప్రగతి భవన్‌కు చేరుకుంది. ఎమ్మెల్యే రాజయ్య.. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రాజయ్య... మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. కడియంతో ఉన్న విభేదాలపై చర్చించారు. తాను చెప్పిన అంశాలపై కేటీఆర్‌ సానుకూలంగా స్పందించారని రాజయ్య చెప్పారు. నియోజకవర్గంలో కడియం పవర్ స్టేషన్‌గా మారి గ్రూపు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తన పని తాను చేసుకోమని కేటీఆర్‌ చెప్పారని తెలిపారు. కడియం కుల వివాదానికి సంబంధించి గతంలో ఉన్న మాటలే చెప్పాను.. పార్టీ పెద్దలు ఆయన్ను పిలిచి మాట్లాడుతారో లేదో తనకు తెలియదన్నారు. సర్పంచ్‌ నవ్య వివాదంలో హైకమాండ్‌కు స్పష్టత ఉందన్నారు రాజయ్య. నవ్య తనపై తప్పుడు కేసు పెట్టినట్లు తేలిపోయిందన్నారు.

Tags

Next Story