చెప్పుతో సమానమని రాజీనామా చేశాను: రాజయ్య

చెప్పుతో సమానమని  రాజీనామా చేశాను: రాజయ్య
చనిపోతే తన సమాధి కూడా స్టేషన్‌ ఘన్‌పూర్‌లోనే ఉంటుందని స్పష్టం చేశారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానన్నారు ఎమ్మెల్యే రాజయ్య

స్టేషన్‌ ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య హాట్ కామెంట్స్‌ చేశారు. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయొద్దని తనకు కోట్ల రూపాయల ఆశ చూపినట్లు వెల్లడించారు. అయితే కోట్ల రూపాయల ఆశ చూపినా చెప్పుతో సమానమని తాను రాజీనామా చేసినట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌కు తాను లొంగిపోలేదని.., ఎప్పుడూ ప్రజలే మధ్యే ఉంటానన్నారు. చనిపోతే తన సమాధి కూడా స్టేషన్‌ ఘన్‌పూర్‌లోనే ఉంటుందని స్పష్టం చేశారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానన్నారు ఎమ్మెల్యే రాజయ్య.

Tags

Next Story