MLC Candidates : బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ముగ్గురి పేర్లను ప్రకటించారు. దేశపతి శ్రీనివాస్, కుర్మయ్య గారి నవీన్, చల్లా వెంకట్రామిరెడ్డి పేర్లను ప్రకటించారు సీఎం కేసీఆర్. ఈనెల 9న ముగ్గురు అభ్యర్థులు నామినేషన్ వేయబోతున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చేయాలని మంత్రి వేములతో పాటు బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని ఆదేశించారు కేసీఆర్. ఇక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు, గవర్నర్ ద్వారా నామినేట్ అయ్యే ఇద్దరి పేర్లను కేబినెట్ సమావేశం తర్వాత ప్రకటించనున్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీపై పలువురు నేతల ఆశలు పెట్టుకున్నారు. ఆశావహుల్లో స్వామిగౌడ్, కర్నె ప్రభాకర్, దాసోజు శ్రవణ్‌తో పాటు తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com