Kadiyam Sri Hari : రాజయ్య మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నాడు : కడియం శ్రీహరి

Kadiyam Sri Hari : ఎమ్మెల్యే రాజయ్య మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. పరోక్షంగా టి.రాజయ్య చేసిన వ్యాఖ్యలకు కడియం ఘాటు రిప్లై ఇచ్చారు. ఒకే పార్టీ వారిపై ఆరోపణలు చేయడం తగదంటూ హితవు పలికారు. ప్రభుత్వ వేదికలను రాజయ్య దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్పకుండా.. తనను టార్గెట్ చేయడం ఏంటని కడియం శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేషన్ ఘన్‌పూర్ ఎవరి అడ్డా కాదని, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గానికి ఏం చేశావో చెప్పాలని నిలదీశారు. రాజయ్య ప్రజల మద్దతు కోల్పోతున్నారని విమర్శించారు. వెంటనే రాజయ్య క్షమాపణలు చెప్పి, వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అంతకు ముందు కడియంపై రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడొందల మందికిపైగా మావోయిస్టులను చంపిన ఘనత కడియందన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి తనతోనే సాధ్యమని, ఎమ్మెల్సీతో ఏం పనులు కావన్నారు. స్టేషన్ ఘన్‌పూర్ తన అడ్డా అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com