MLC Kavitha: సిటీ సివిల్ కోర్టులో ఎమ్మెల్సీ కవిత పరువు నష్టం దావా..

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై బీజేపీ నేతల ఆరోపణలపై TRS సీరియస్‌గా రియాక్ట్ అయింది. తనపై నిరాధార ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ పరవేష్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజీందర్ సిర్సా పై కోర్టును ఆశ్రయించరు ఎమ్మెల్సీ కవిత. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో ఇంజక్షన్ పిటిషన్ దాఖలు చేశారు కవిత. ఉద్దేశపూర్వకంగా తప్పుడు, నిరాధార ఆరోపణలతో ప్రజా జీవితంలో ఉన్న తన పరువుకు భంగం కలిగించే ప్రకటనలు చేశారనీ పేర్కొన్నారు.
ప్రజల్లో తనకు ఉన్న మంచి పేరును చెడగొట్టడానికి అక్రమ పద్ధతులను ఎంచుకున్నారన్నారని విమర్శించారు. తన ప్రతిష్టకు భంగం వాటిల్లేలా వ్యవహరించిన వారు బేషరతుగా క్షమాపణలు చెప్పేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కవిత విన్నవించారు. అటు బీజేపీ ఎంపీలు చేసిన ఆరోపణలతో.. కాంగ్రెస్ నేతలు కూడా జతకలిసినట్టుగా KCR కుటుంబం పై విమర్శలు చేస్తున్నారు. ఇక కమలం నేతలు మరో అడుగు ముందుకేసి ఎమ్మెల్సీ పదవి నుంచి కవితను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
దేశ వ్యాప్తంగా కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయన్నకవిత.. ఎలాంటి సంబంధం లేదనీ తేల్చి చెప్పినా విపక్షాల నేతలు టార్గెట్ చేశారని అన్నారు. సీఎం కేసీఆర్ బిడ్డ కాబట్టే ఆరోపణలు చేస్తున్నారని..కేసీఆర్ వెనక్కి తగ్గుతారనే ఆలోచనతో కేంద్రం కక్షసాధింపు చర్యలు దిగుతోందని కవిత మండిపడ్డారు. కేంద్రంపై కేసీఆర్ పోరాటంఅపుతారనే ఆలోచనతోనే..తనపై బట్టకాల్చి మిదేస్తున్నారనీ విమర్శించారు. కేంద్రంపై పోరులో వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com