కేసీఆర్‌కు కవిత సెల్యూట్.. నిజమైన నాయకుడంటూ ట్వీట్..!

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. కొందరికి అవరోధాలు అడ్డంకిగా మారితే, మరికొందరిని గొప్ప వ్యక్తులుగా తయారు చేస్తాయన్న నెల్సన్ మండేలా సూక్తిని ఆమె ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రజల స్వేచ్ఛ కోసం తన జీవితాన్ని త్యాగం చేసే స్థాయికి వెళ్ళిన నిజమైన నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు కవిత సెల్యూట్ చేశారు.
తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం గత ఇరవై ఏళ్లుగా నిరంతరం శ్రమిస్తూ, అనేక త్యాగాలు చేసిన టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్సుమాంజలులు అని ట్వీట్‌లో పేర్కొన్నారు. 2001లో కేసీఆర్ ఇదే రోజున టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు..ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా మారి నేడు తెలంగాణరాష్ట్రంలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగింది టీఆర్ఎస్. ఇప్పుడు 21 వసంతంలో అడుగుపెడుతున్న సందర్భంగా పార్టీ వార్షికోత్సవ వేడుకలు నేడు నిరాడంబరగా జరగనున్నాయి.
Difficulties break some men but make others - Nelson Mandela.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) April 26, 2021
Saluting to the real leader KCR garu who went to the extent of sacrificing his own life for the freedom of people of Telangana. 1/2 pic.twitter.com/B9770pDKcT
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com