జమ్మికుంట నడిబొడ్డున ఉన్న ఫ్లై ఓవర్ బ్రిడ్జి నీ తొలగిస్తా.. కౌశిక్ రెడ్డి

ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఎమ్మెల్యే గా అవకాశం ఇస్తే కరీంనగర్ జిల్లా జమ్మికుంట నడిబొడ్డున ఉన్న ఫ్లై ఓవర్ బ్రిడ్జి నీ తొలగిస్తానని గత ఇరవై సంవత్సరాలు గా ఎమ్మల్యే గా మంత్రి గా పని చేసిన స్థానిక ఎమ్మెల్యే ఎటువంటి అభివృద్ధి చేయలేదని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చెరువుల పండుగ కార్యక్రమం లో పాల్గొన్న ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం లో అమలు చేస్తున్న పథకాలు ఏ ఒక్కటి బిజెపి పాలిత ప్రాంతాల్లో అమలు కావడం లేదని రాష్ట్ర అభివృద్ధి పై స్థానిక ఎమ్మెల్యే ఎంపీ లతో చర్చకు తాను సిద్దమని మీరు సిద్దం గా ఉన్నారా అని సవాలు విసిరారు. రాష్ట్రం లో అన్ని మంత్రుల నియోజక వర్గాల్లో అభివృద్ధి జరిగితే ఒక్క హుజూరాబాద్ నియోజక వర్గం లో నే అభివృద్ధి జరుగలేదని తాను ఎమ్మేల్యే గా గెలిచిన తరువాత నాయిని చెరువును సుందరం గా తీర్చి దిద్దడమే కాకుండా పట్టణం నడిబొడ్డున ఉన్న ఫ్లై ఓవర్ బ్రిడ్జి ను తొలగిస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com