IAF: కనువిందు చేసిన ఫ్లయింగ్ క్యాడెట్ల కవాతు

హైదరాబాద్ దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న ఫ్లయింగ్ క్యాడెట్ల కవాతు ప్రదర్శన కనువిందు చేసింది. ఎయిర్ చీఫ్ మార్షల్ వి. ఆర్. చౌదరి ముఖ్యఅతిథిగా హాజరై క్యాడెట్ ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకలో ఫ్లైట్ క్యాడెట్ లు, ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్ ల విన్యాసాలు ఆద్యంతం అలరించాయి. దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న ఫ్లయింగ్ క్యాడెట్ల కవాతు ప్రదర్శన ఆకట్టుకుంది. 235 ఫ్లయింగ్ క్యాడెట్లు శిక్షణ పూర్తైన తర్వాత తమ ప్రతిభ పాటవాలను ప్రదర్శించారు. 235 మందిలో 22 మంది మహిళ అధికారులు కాగా.... 9 మంది భారత నేవీ దళానికి చెందిన వారు. మరో 9 మంది కోస్ట్ గార్డు విభాగానికి చెందినవారు ఉన్నారు. జాతీయ డిఫెన్స్ అకాడమీకి చెందిన వారు 25 మంది ఉన్నారు. ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో వీరికి శిక్షణ ఇచ్చారు. క్యాడెట్ల కవాతు ప్రదర్శన అనంతరం వారితో అకాడమి కమాండెంట్ ప్రమాణం చేయించారు.
శిక్షణ పూర్తి చేసుకున్న ఫ్లయింగ్ క్యాడెట్లకు ఎయిర్ చీఫ్ మార్షల్ జనరల్ చౌదరి అభినందనలు తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారు విశిష్ట స్థాయిలో దేశానికి సేవలు అందించాలని ఆయన ఆకాంక్షించారు. విధులను సమర్థవంతంగా నిర్వర్తించడానికి అకాడమీ వృత్తిపరమైన నైపుణ్యాలను అందించిందన్నారు. ఆధునిక యుద్ధంలో అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలని ఎయిర్ చీఫ్ మార్షల్ సూచించారు.
కవాతు ప్రదర్శన అనంతరం... ఫ్లయింగ్ క్యాడెట్లు తమ ఆనందాన్ని తల్లిదండ్రులు, కుటుంబసభ్యులతో కలిసి పంచుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com