Modi Hyderabad Visit: మోదీ హైదరాబాద్ పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు..

X
Narendra Modi (tv5news.in)
Modi Hyderabad Visit: ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో వివిధ శాఖల అధికారులతో సీఎస్ సోమేష్ కుమార్ సమన్వయ సమావేశం నిర్వహించారు. డీజీపీ మహేందర్ రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు సమన్వయ సమావేశానికి హాజరయ్యారు. ఈనెల 5న హైదరాబాద్ రానున్న ప్రధాని.. ముచ్చింతల్, ఇక్రిసాట్‌లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ప్రధాని పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా చేయడంతోపాటు, సమన్వయంతో పనిచేయాలని సంబంధిత శాఖల అధికారులు సీఎస్ ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తును బ్లూ బుక్ ప్రకారం ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖకు సూచించారు. ప్రధాని కాన్వాయ్ ప్రయాణించే రహదారుల మరమ్మత్తు పనులు చేపట్టాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
