Mohan Babu : మోహన్ బాబు హెల్త్ బులిటెన్ విడుదల

కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ నటుడు మోహన్ బాబు హెల్త్ బులెటిన్ ను వైద్యులు విడుదల చేశారు. మోహన్ బాబు ఆరోగ్యం స్థిమితంగా ఉన్నట్లు వెల్లడించారు. మోహన్ బాబు ఎడమకంటికి చిన్న గాయమైందని.. బీపీ లెవల్స్ పెరిగాయని తెలిపారు. మోహనాబాబుకు తన పక్కన ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారని వైద్యులు తెలిపారు. కుడి కంటి కింద వాపు ఉందని వైద్యులు వెల్లడించారు.
హైకోర్టులో మోహన్ బాబు లంచ్ మోషన్ పిటిషన్
మంచు మోహన్ బాబు కుటుంబంలో వివాదం చిలికిచిలికి గాలివానలా మారింది. ఇప్పటికే మంచు మనోజ్-మోహన్ బాబు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఇప్పుడు ఈ వివాదం తెలంగాణ హైకోర్టుకు చేరింది. పోలీసులు జారీ చేసిన నోటీసుపై మోహన్ బాబు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల విచారణ నోటీసును మోహన్ బాబు సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై మధ్యాహ్నం 2.30కు హైకోర్టులో విచారణ జరగనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com