Hyderabad: గల్లపెట్టెను గుల్ల చేసిన తల్లీకూతురు

హైదరాబాద్ ఉప్పల్‌లో తల్లీకూతురు కలిసి చేసిన ఘరాన చోరీ అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ షాపలోకి తల్లీకూతురు ఇద్దరూ ప్రవేశించారు. అనంతరం ఓనర్‌ను ఆ తల్లి మాటల్లో పెట్టింది. ఈ క్రమంలో కూతురూ షాపులో ఉన్నదంతా దోచేసింది. ఈ అటెన్షన్ డైవర్షన్ థెఫ్ట్ ఔరా అన్పిస్తోంది.
రామంతాపూర్ ఆర్టీసీ కాలనీలోని ఐస్ క్రీమ్ దుకాణానికి వచ్చారీ తల్లీకూతుళ్లు. తల్లి షాప్ ఓనర్‌ను మాటల్లో పెడితే.. కూతురు క్యాష్ కౌంటర్‌ను ఖాళీ చేసింది. ఏమీ తెలియనట్లు బయటకు వచ్చి.. తల్లితో కలిసి వెళ్లిపోయింది. డబ్బు కన్పించకపోవడంతో.. సీసీ కెమెరా ఫుటేజ్‌ను చూసిన షాప్ నిర్వాహకులు దొంగతనం జరిగిన తీరుతో ఆశ్చర్యపోయారు. వారిపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ఘరానా తల్లీకూతురు కోసం గాలిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com