పెళ్లి బాజా మోగాల్సిన ఇంట్లో తల్లి, ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్య
By - Nagesh Swarna |10 Dec 2020 9:40 AM GMT
ఖమ్మం నగరంలోని గాంధీ చౌక్ లో విషాదం చోటుచేసుకుంది. పెళ్లి బాజా మోగాల్సిన ఆ ఇంట్లో.. చావు మేళం మోగింది. రాఘవ థియేటర్ సమీపంలో నివసించే కుటుంబంలోని పెద్ద కూతురు రాధికకి జనవరి 11న వివాహం కుదిరింది. తండ్రి బంగారం షాపులో పనిచేస్తుండగా.. తల్లి, కుమార్తెలు టైలరింగ్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే పెళ్లి తేదీ దగ్గర పడుతుండడం, డబ్బులు సర్దుబాటు కాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దీంతో బంగారం మెరుగు పెట్టే రసాయనం తాగి తల్లి, కుమార్తెలు ఆత్మహత్య చేసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com