మిస్సింగ్ కలకలం.. ఒకే రోజు తల్లీకూతుళ్లు, 20 ఏళ్ల యువతి అదృశ్యం

X
శంషాబాద్ పరిధిలో మిస్సింగ్ కేసులు కలకలం రేపుతున్నాయి. ఓకే రోజు తల్లీ కూతుళ్లు, ఓ యువతి అదృశ్యమయ్యారు. సాతంరాయి గ్రామానికి చెందిన తల్లీ కూతుళ్లు వాణి, భవిష్య, గగన్ పహాడ్‌కు చెందిన 20 ఏళ్ల యువతి శిరీష అదృశ్యమయ్యారు. మంగళవారం ఉదయం టైలరింగ్ శిక్షణ కోసం వెళ్లిన శిరీష.. తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇటు సాతంరాయిలో తల్లీ, కూతురు మిస్సింగ్ కేసు నమోదయ్యాయింది. గత రాత్రి నుంచి ఇద్దరూ కనబడటంలేదు. భర్తతో గొడవల కారణంగానే ఇంటి నుంచి వెళ్లిపోయినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ రెండు ఘటనలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
