CRIME: ఎంత పనిచేశావమ్మా...

తనకు ఏమైనా సహిస్తుంది.. భరిస్తుంది కానీ బిడ్డల జోలికి వస్తే మాత్రం తల్లి పూర్తి భిన్నంగా ప్రవర్తిస్తుంది. వారి కోసం చావుతో పోరాడుతుంది. బిడ్డల క్షేమం కోసం ఎంతటి సాహసమైనా చేస్తుంది. కానీ ఓ తల్లి కర్కశమైన నిర్ణయం తీసుకుంది. ఆరోగ్య సమస్యలు వేధించడం.. భర్తతో విడిపోవడం ఆమెను నిర్దయగా మార్చేసింది. దీంతో కఠిన నిర్ణయం తీసుకున్న ఆమె... ఏడేళ్లు, ఐదేళ్ల వయసున్న ఇద్దరు కొడుకులను కొబ్బరి బోండాలు నరికే కత్తితో నరికేసింది. అనంతరం ఆమె కూడా భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ లోని జీడిమెట్లలో ఈ దారుణం జరిగింది. తేజ అనే మహిళ హర్షిత్ రెడ్డి(7), ఆశీష్ రెడ్డి(5) అనే ఇద్దరు కుమారులను వేడ కొడవలితో నరికి చంపింది. రక్తపు మడుగులో పడి ఉన్న పిల్లల మృతదేహాలు అందరినీ కంటతడి పెట్టించాయి. మహిళకు, పిల్లలకు అనారోగ్య సమస్యలు, కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఆమె ఈ దారుణానికి ఒడిగట్టినట్లు బాలానగర్ డిఎస్పీ సురేష్ కుమార్ తెలిపారు. ఆమె రాసిన సూసైట్ లెటర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com