MP Aravind : తెలంగాణ సెంటిమెంట్‌ను కేసీఆర్ ఎన్నాళ్లు వాడుకుంటారు : ఎంపీ అరవింద్

MP Aravind : తెలంగాణ సెంటిమెంట్‌ను కేసీఆర్ ఎన్నాళ్లు వాడుకుంటారు : ఎంపీ అరవింద్
X
MP Aravind : ప్రధానమంత్రి మోదీ వ్యాఖ్యలపై ఆందోళనకు దిగిన టీఆర్ఎస్, కాంగెస్ పార్టీల వ్యవహార శైలిని ఎంపి ధర్మపురి అరవింద్ తీవ్రంగా తప్పుపట్టారు.

MP Aravind : ప్రధానమంత్రి మోదీ వ్యాఖ్యలపై ఆందోళనకు దిగిన టీఆర్ఎస్, కాంగెస్ పార్టీల వ్యవహార శైలిని ఎంపి ధర్మపురి అరవింద్ తీవ్రంగా తప్పుపట్టారు. పార్లమెంట్‌లో ప్రధాని మోదీ ఏమాత్రం తప్పుగా మాట్లాడలేదన్నారు. రాష్ట్ర ఏర్పాటు సమయంలో నిర్మాణాత్మక చర్చజరుగలేదన్నారు. కేంద్రబడ్జెట్ రోజునుంచే టీఆర్ ఎస్ నేతలు పూనకం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసమే 2004లో తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వలేదని... రాష్ట్ర ఏర్పాటు ఆలస్యం కారణంగా 12వందల మంది యువకులు అమరులయ్యారన్నారు. ఇంకా ఎన్నాళ్లు తెలంగాణ సెంటిమెంట్‌ను కేసీఆర్ ఉపయోగించుకుంటారని ఎద్దేవా చేశారు.

Tags

Next Story