Bandi Sanjay : వనమ రాఘవని తక్షణమే అరెస్ట్ చేయాలి : బండి సంజయ్

X
Bandi Sanjay (tv5news.in)
By - TV5 Digital Team |7 Jan 2022 12:45 PM IST
Bandi Sanjay : టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు.
Bandi Sanjay : టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం కుటుంబం సాముహిక ఆత్మహత్యకు బాధ్యుడైన.. వనమ రాఘవ తక్షణమే అరెస్ట్ చేయాలని సంజయ్ డిమాండ్ చేశారు. గతంలో మహిళలపై అత్యాచారం చేసిన వారిని ఎన్‌కౌంటర్ చేసిన ప్రభుత్వం.. వనమ రాఘవను ఎందుకు వెనకెసుకు వస్తోందని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం పోలిటికల్ మైలేజ్ కోసం ఆలోచించకుండా నిందితుడిని కఠినంగా శిక్షించాలన్నారు. రాఘవను అరెస్ట్ చేసేంతవరకు బీజేపీ ఆందోళనలు కొనసాగుతాయని సంజయ్ స్పష్టం చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com