ZPTC నుంచి TPCC వరకు అంచెలంచెలుగా ఎదిగిన రేవంత్‌రెడ్డి..!

జడ్‌పీటీసీగా ప్రస్థానం ప్రారంభించిన రేవంత్‌రెడ్డి అంచెలంచెలుగా ఎదిగి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రస్థానంలో వివిధ పదవులు చేపట్టారు. నాగర్‌కర్నూల్ జిల్లా వంగూర్ మండలం కొండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన నర్సింహారెడ్డి, రామచంద్రమ్మ దంపతులకు 1967 నవంబర్ 8న రేవంత్‌రెడ్డి జన్మించారు. హైదరాబాద్ ఏవీ కాలేజీలో రేవంత్‌రెడ్డి డిగ్రీ పూర్తి చేశారు. రేవంత్‌కు భార్య గీత, కుమార్తె నైమిషా ఉన్నారు. కుమార్తెకు వివాహం చేశారు.
రేవంత్‌రెడ్డి 2006లో టీఆర్‌ఎస్ నుంచి మిడ్జిల్ మండలం నుంచి జడ్‌పీటీసీగా ఎన్నికయ్యారు. 2007 నుంచి 2009 వరకు ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ఎమ్మెల్సీగా పని చేశారు. అనంతరం 2009 నుంచి 2014 మధ్య ఎమ్మెల్యేగా సేవలు అందించారు. ప్రత్యేక రాష్ట్రంలో 2014 నుంచి 2017 వరకు తెలంగాణ టీడీపీఎల్పీ నేతగా పని చేశారు. 2017 అక్టోబర్‌లో కాంగ్రెస్‌లో చేరారు. 2018 నుంచి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పని చేస్తున్నారు. 2019 మేలో మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com