Revanth Reddy : TPCC చీఫ్ గా రేవంత్ రెడ్డి..!

Revanth Reddy :గత కొంతకాలంగా సస్పెన్స్ థ్రిల్లర్ గా కొనసాగుతున్న టీపీసీ చీఫ్ అధ్యక్ష పదవికి తెర పడింది. మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డిని టీపీసీ చీఫ్ గా ఎంపిక చేస్తూ ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా అజారుద్దీన్, గీతారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, జగ్గారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ లను నియమించింది. ఇక ఉపాధ్యక్షులుగా చంద్రశేఖర్ సంబని, దామోదర్‌రెడ్డి, రవి మల్లు, పొడెం వీరయ్య, సురేశ్ షెట్కార్, వేం నరేందర్‌రెడ్డి, రమేశ్ ముదిరాజ్, గోపిశెట్టి నిరంజన్, టి.కుమార్ రావు, జావేద్ ఆమీర్ నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రచారకమిటీకి ఛైర్మన్‌గా మధు యాస్కీ గౌడ్, కన్వీనర్‌గా సయ్యద్ అజమ్‌తుల్లా హుస్సేనీ, ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా దామోదర్ సి.రాజ నర్సింహయ్య, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్‌గా ఆలేటి మహేశ్వరరెడ్డి నియమితులయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com