MUNCIPAL POLLS: సత్తా చాటాలని కాంగ్రెస్..ఉనికి చాటాలని బీఆర్ఎస్

MUNCIPAL POLLS: సత్తా చాటాలని కాంగ్రెస్..ఉనికి చాటాలని బీఆర్ఎస్
X
అధికారం చేపట్టాక పార్టీ గుర్తుపై ఎన్నికలు... గెలిచి తీరాలన్న పట్టుదలతో కాంగ్రెస్... సత్తా చాటాలని చూస్తున్న విపక్షాలు

ము­న్సి­ప­ల్ ఎన్ని­కల నా­మి­నే­ష­న్ల విత్ డ్రా పర్వం ము­గి­య­డం­తో ప్ర­ధాన పా­ర్టీ­లు గె­లు­పు­పై ఫో­క­స్ పె­ట్టా­యి. 100కు పైగా ము­న్సి­పా­ల్టీ­లు, 7 కా­ర్పో­రే­ష­న్ల­ను కై­వ­సం చే­సు­కో­వా­ల­ని కాం­గ్రె­స్ టా­ర్గె­ట్ పె­ట్టు­కు­న్న­ది.అం­దు­కో­సం మం­త్రు­ల­కు ఎన్ని­కల స్ట్రా­ట­జీ­పై సీఎం రే­వం­త్ రె­డ్డి ది­శా­ని­ర్దే­శం చే­శా­రు. ఉత్తర తె­లం­గాణ లో బలం­గా ఉన్న బీ­జే­పీ పా­ర్టీ ఈసా­రి ని­జా­మా­బా­ద్,కరీం­న­గ­ర్ కా­ర్పో­రే­ష­న్ల తో పాటు 10 ము­న్సి­పా­ల్టీ­లో వి­జ­యం సా­ధిం­చా­ల­ని ప్లా­న్ చే­స్తు­న్న­ది. అయి­తే రా­ష్ట్రం­లో ప్ర­ధాన ప్ర­తి­ప­క్షం­గా ఉన్న బీ­ఆ­ర్ఎ­స్ తమ ఉని­కి­ని చా­టు­కు­నేం­దు­కు ము­న్సి­పా­ల్టీ­ల­కం­టే ఓటు శా­తం­పై ఫో­క­స్ పె­ట్టిం­ది.

కాంగ్రెస్‌కు తొలి పరీక్ష..

అధి­కా­రం­లో­కి వచ్చిన తరు­వాత పా­ర్టీ గు­ర్తు­ల­తో జరు­గు­తో­న్న తొలి ఎన్ని­క­లు కా­వ­డం­తో కాం­గ్రె­స్ లీ­డ­ర్లు చా­లెం­జ్ గా తీ­సు­కుం­టు­న్నా­రు. మె­జా­ర్టీ అర్బ­న్ బా­డీ­ల్లో వి­జ­యం సా­ధిం­చా­ల­ని టా­ర్గె­ట్ పె­ట్టు­కు­న్నా­రు. లే­క­పో­తే అటు పా­ర్టీ, ఇటు ప్ర­భు­త్వం­పై పరు­వు పో­తుం­ద­నే టె­న్ష­న్ పట్టు­కు­న్న­ది. అం­దు­కే ఒక్కో లో­క­సభ ని­యో­జ­వ­ర్గా­ని­కి ఒక్కో మం­త్రి­ని ఇన్ చా­ర్జి­గా ని­య­మిం­చా­రు. ఆ ఏరి­యా­ల్లో­ని ము­న్సి­పా­ల్టీ­లు, కా­ర్పో­రే­ష­న్ల­లో పా­ర్టీ గె­లు­పు­ఓ­ట­ముల బా­ధ్య­త­ల­ను సదరు మం­త్రు­ల­కు కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు అప్ప­గిం­చా­రు.

ఎన్ని­క­ల్లో అను­చ­రిం­చా­ల్సిన వ్యూ­హా­ల­ను సీఎం రే­వం­త్ రె­డ్డి మం­త్రు­ల­కు వి­వ­రి­స్తూ, క్షే­త్ర స్థా­యి­లో పా­ర్టీ­కి సా­ను­కూల వా­త­వ­ర­ణం ఉం­ద­ని పలు సర్వేల ని­వే­ధి­క­ల­ను మం­త్రు­ల­కు అం­దిం­చా­రు. అం­దు­క­ని ఎన్ని­క­లు ము­గి­సే వరకు సం­బం­ధిత లో­క­సభ పరి­ధి­లో ఉంటూ పా­ర్టీ గె­లు­పు కోసం కృషి చే­యా­ల­ని సూ­చిం­చా­రుు. ప్ర­స్తు­తం 116 ము­న్సి­పా­ల్టీ­లు,7 కా­ర్పో­రే­ష­న్ల­లో ఎన్ని­క­లు జరు­గు­తు­న్నా­యి. అం­దు­లో కనీ­సం 100 పైగా ము­న్సి­పా­ల్టీ­ల్లో చై­ర్మ­న్ పదవి దక్కిం­చు­కు­నేం­దు­కు కా­వా­ల్సిన కా­ర్పొ­రే­ట­ర్ల­ను గె­లి­పిం­చు­కో­వా­ల­ని టా­ర్గె­ట్ పె­ట్ట­కు­న్న­ట్లు తె­లి­సిం­ది. అలా­గే ఎన్ని­క­లు జరు­గు­తో­న్న 7 కా­ర్పో­రే­ష­న్ల­లో మే­య­ర్ పద­వి­ని కాం­గ్రె­స్ గె­లు­చు­కు­నేం­దు­కు లక్ష్యం­గా పె­ట్టు­కు­న్నా­రు. ఉత్తర తె­లం­గా­ణ­లో బలం­గా ఉన్న బీ­జే­పీ పా­ర్టీ ఆ ఏరి­యా­లో మె­జా­ర్టీ ము­న్సి­పా­ల్టీ­ల­ను సొం­తం చే­సు­కో­వా­ల­ని టా­ర్గె­ట్ పె­ట్టు­కు­న్న­ది. ప్ర­ధా­నం­గా ని­జా­మా­బా­ద్,కరీం­న­గ­ర్ ము­న్సి­ప­ల్ కా­ర్పో­రే­ష­న్లు, 10 ము­న్సి­పా­ల్టీ­ల­ను కై­వ­సం చే­సు­కు­నేం­దు­కు ప్లా­న్ చే­స్తు­న్న­ది. అం­దు­కో­సం కేం­ద్ర­మం­త్రి బండి సం­జ­య్ కొ­న్ని రో­జు­లు­గా కరీం­న­గ­ర్ లో ఉంటూ అభ్య­ర్థుల ఎం­పిక, ప్ర­చా­రం కొ­న­సా­గి­స్తు­న్నా­రు. అలా­గే ని­జా­మా­బా­ద్ ఎంపీ అర్విం­ద్ కు­మా­ర్ సైతం ని­జా­మా­బా­ద్ కా­ర్పో­రే­ష­న్ లో వి­జ­యం సా­ధిం­చేం­దు­కు తీ­వ్రం­గా కష్ట­ప­డు­తు­న్నా­రు. మరో­వై­పు అది­లా­బా­ద్ ఎంపీ నగే­ష్ సైతం ని­యో­జ­క­వ­ర్గం­లో­ఉం­టూ గె­లు­పు­కో­సం ప్ర­య­త్నా­లు చే­స్తు­న్నా­రు.

Tags

Next Story