MUNCIPALL POLLS: తెలంగాణలో పెను మార్పులకు "సెమీ ఫైనల్స్"

MUNCIPALL POLLS: తెలంగాణలో పెను మార్పులకు సెమీ ఫైనల్స్
X
సత్తా చాటాలన్న పట్టుదలతో మూడు పార్టీలు

తెలంగాణ రాజకీయాల దిశను నిర్ణయించే కీలక ఘట్టంగా మున్సిపల్ ఎన్నికలు మారాయి. పట్టణ పాలనకే పరిమితమయ్యే సాధారణ ఎన్నికలుగా కాకుండా, రానున్న రాజకీయ సమీకరణాలకు సూచికగా ఈ ఫలితాలను అన్ని పార్టీలు చూస్తున్నాయి. ముఖ్యంగా 2028 అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తు సంకేతాలుగా, అంతకంటే ముందున్న పంచాయతీ ఎన్నికలకు మానసిక రిహార్సల్‌గా ఈ పోరు రూపుదిద్దుకుంది. అందుకే రేపు జరగనున్న మున్సిపల్ ఎన్నికలు తెలంగాణ రాజకీయాల్లో ఒక మలుపుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రా­ష్ట్ర­వ్యా­ప్తం­గా 116 ము­న్సి­పా­లి­టీ­లు, 7 కా­ర్పొ­రే­ష­న్ల­లో జరు­గు­తు­న్న ఈ ఎన్ని­క­లు ఇప్పు­డు రెం­డు ప్ర­ధాన రా­జ­కీయ శక్తుల మధ్య మా­త్ర­మే కా­కుం­డా, మూడు దిశల పో­రు­గా మా­రా­యి. అధి­కార కాం­గ్రె­స్ తన పట్టు ని­లు­పు­కో­వా­ల­నే పట్టు­ద­ల­తో బరి­లో­కి ది­గి­తే, ప్ర­తి­ప­క్ష బీ­ఆ­ర్ఎ­స్ తి­రి­గి పుం­జు­కో­వా­ల­ని తహ­త­హ­లా­డు­తోం­ది. ఇది­లా ఉం­డ­గా, బీ­జే­పీ కూడా పట్టణ ఓట­ర్ల­లో తన స్థా­నం మరింత బల­ప­రు­చు­కో­వా­ల­నే లక్ష్యం­తో రం­గం­లో­కి ది­గిం­ది. అధి­కా­రం­లో­కి వచ్చిన తర్వాత తొలి పె­ద్ద పట్టణ ఎన్ని­క­ల­ను ఎదు­ర్కొం­టు­న్న కాం­గ్రె­స్‌­కు ఇది కీలక పరీ­క్ష. అసెం­బ్లీ ఎన్ని­క­ల్లో వచ్చిన వి­జ­యం యా­దృ­చ్ఛి­కం కా­ద­ని ని­రూ­పిం­చా­ల్సిన బా­ధ్యత ఇప్పు­డు ము­ఖ్య­మం­త్రి రే­వం­త్ పై ఉంది. గ్రా­మీణ ప్రాం­తా­ల్లో ఇటీ­వల జరి­గిన పం­చా­య­తీ ఎన్ని­క­ల్లో కాం­గ్రె­స్ మద్ద­తు గణ­నీ­యం­గా పె­రి­గి­న­ట్లు ఫలి­తా­లు సూ­చిం­చా­యి. అదే ఊపు­ను పట్ట­ణా­ల్లో­నూ కొ­న­సా­గిం­చ­గ­లి­గి­తే, కాం­గ్రె­స్‌­కు ఇది బల­మైన రా­జ­కీయ ధృ­వీ­క­ర­ణ­గా మా­రు­తుం­ది. అం­దు­కే మం­త్రు­ల­ను పా­ర్ల­మెం­ట­రీ ని­యో­జ­క­వ­ర్గాల ఇన్‌­ఛా­ర్జు­లు­గా ని­య­మిం­చి, పట్టణ ఓట­ర్ల­ను ఆక­ట్టు­కు­నే­లా వి­స్తృత వ్యూ­హా­లు రచి­స్తోం­ది.

కారు గేరు మార్చాల్సిందే

మరో­వై­పు, అసెం­బ్లీ ఎన్ని­కల ఓటమి తర్వాత ఆత్మ­వి­శ్వా­సం కో­ల్పో­యిన బీ­ఆ­ర్ఎ­స్‌­కు ఈ ము­న్సి­ప­ల్ ఎన్ని­క­లు ప్రా­ణ­ప్ర­ద­మై­న­వి­గా మా­రా­యి. గ్రా­మీణ ఎన్ని­క­ల్లో కొం­త­వ­ర­కు తన ఉని­కి­ని చా­టు­కు­న్న గు­లా­బీ పా­ర్టీ, పట్ట­ణా­ల్లో­నూ అదే స్థా­యి­లో పుం­జు­కో­వా­ల­ని ఆశి­స్తోం­ది. గత పా­ల­న­లో చే­ప­ట్టిన మౌ­లిక సదు­పా­యాల అభి­వృ­ద్ధి­ని, ప్ర­స్తుత ప్ర­భు­త్వం­పై అసం­తృ­ప్తి­ని ఆయు­ధం­గా చే­సు­కు­ని ఓట­ర్ల­ను ప్ర­భా­వి­తం చే­యా­ల­నే ప్ర­య­త్నం చే­స్తోం­ది. ఈ ఎన్ని­క­ల్లో ఆశిం­చిన ఫలి­తా­లు రా­క­పో­తే, పా­ర్టీ భవి­ష్య­త్తు­పై ప్ర­శ్నా­ర్థ­కా­లు పె­రి­గే పరి­స్థి­తి ఉం­ద­న్న భావన బీ­ఆ­ర్ఎ­స్ శ్రే­ణు­ల్లో కని­పి­స్తోం­ది. ఈ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తే గులాబీ పార్టీ మరింత కష్టాల్లో పడే అవకాశం ఉంది.

ఆరు గ్యారెంటీలే హస్తం ఆయుధం

ఈ ఎన్ని­క­ల్లో కాం­గ్రె­స్‌­కు ప్ర­ధాన ఆయు­ధం­గా మా­రిం­ది ‘ఆరు గ్యా­రెం­టీ­లు’. పట్టణ ప్రాం­తా­ల్లో ఈ పథ­కాల లబ్ధి­దా­రుల సం­ఖ్య ఎక్కు­వ­గా ఉం­డ­టం అధి­కార పా­ర్టీ­కి కలి­సొ­చ్చే అంశం. ఉచిత బస్సు ప్ర­యా­ణం, మహి­ళల ఆర్థిక భద్ర­త­కు సం­బం­ధిం­చిన పథ­కా­లు, వి­ద్యు­త్ సా­యం­పై తీ­సు­కు­న్న ని­ర్ణ­యా­లు పట్టణ మధ్య­త­ర­గ­తి, ది­గువ వర్గా­ల­పై ప్ర­భా­వం చూ­పు­తు­న్నా­యి. అయి­తే, రైతు భరో­సా, రు­ణ­మా­ఫీ వంటి అం­శా­ల్లో ఉన్న అని­శ్చి­తి­ని ప్ర­తి­ప­క్షా­లు బలం­గా ఎత్తి­చూ­పు­తు­న్నా­యి. ఈ హా­మీ­లు వా­స్త­వం­గా తమ జీ­వి­తా­ల్లో మా­ర్పు తె­చ్చా­యా లేదా అన్న­దా­ని­పై ఓట­ర్లు ఎలా స్పం­ది­స్తా­ర­న్న­దే కాం­గ్రె­స్ భవి­త­వ్యా­న్ని ని­ర్ణ­యిం­చ­నుం­ది.

బీజేపీ బలం పుంజుకుంటుందా..?

ఈ ద్వం­ద్వ పో­రు­లో మూడో శక్తి­గా బీ­జే­పీ ముం­దు­కు వస్తోం­ది. ఇటీ­వల జరి­గిన పా­ర్ల­మెం­ట్ ఎన్ని­క­ల్లో సా­ధిం­చిన వి­జ­యాల ఊపు­ను ము­న్సి­ప­ల్ ఎన్ని­క­ల్లో­కి తీ­సు­కె­ళ్లా­ల­ని ఆ పా­ర్టీ భా­వి­స్తోం­ది. ము­ఖ్యం­గా ఉత్తర తె­లం­గా­ణ­లో తనకు ఉన్న సం­ప్ర­దాయ ఓటు బ్యాం­కు­ను పట్ట­ణా­ల్లో­నూ వి­స్త­రిం­చా­ల­నే లక్ష్యం­తో వ్యూ­హా­లు రచి­స్తోం­ది. ఆస్తి పన్ను­లు పెం­చ­బో­మ­న్న హామీ, అవి­నీ­తి రహిత పా­ల­న­పై నొ­క్కి­చె­ప్ప­డం ద్వా­రా మధ్య­త­ర­గ­తి ఓట­ర్ల­ను ఆక­ట్టు­కు­నే ప్ర­య­త్నం చే­స్తోం­ది. కొ­న్ని కీలక పట్ట­ణా­ల్లో గణ­నీ­య­మైన స్థా­నా­లు సా­ధిం­చ­గ­లి­గి­తే, తె­లం­గాణ రా­జ­కీ­యా­ల్లో బీ­జే­పీ పా­త్ర మరింత బల­ప­డే అవ­కా­శం ఉంది. మొ­త్తం­గా చూ­స్తే, ఈ ము­న్సి­ప­ల్ ఎన్ని­క­లు కే­వ­లం పట్టణ పరి­పా­ల­న­కు సం­బం­ధిం­చి­న­వి కావు. ఇవి రా­ను­న్న ఎన్ని­కల రా­జ­కీయ ది­శ­ను ని­ర్ధా­రిం­చే సూ­చి­క­లు. ఇక్కడ పట్టు సా­ధిం­చిన పా­ర్టీ­లు ధై­ర్యం­గా ముం­ద­డు­గు వే­య­గ­ల­వు. వె­ను­క­బ­డిన పా­ర్టీ­లు మా­త్రం తమ వ్యూ­హా­ల­ను తి­రి­గి సమీ­క్షిం­చు­కో­వా­ల్సిం­దే. తె­లం­గాణ రా­జ­కీయ మా­ర్పు­ల­కు పు­నా­ది ఈ ము­న్సి­ప­ల్ ఫలి­తా­లే అని చె­ప్ప­డం­లో సం­దే­హం లేదు.

Tags

Next Story