MUNCIPAL RESULTS: వడ్డేపల్లిని దక్కించుకున్న ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ

MUNCIPAL RESULTS: వడ్డేపల్లిని దక్కించుకున్న ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ
X
చిట్యాల మున్సిపాలిటీలో ఒక చారిత్రాత్మక ఫలితం.. ట్రాన్స్ జెండర్ గెలుపు

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రధాన పార్టీల ఆధిపత్యం మధ్య ఒక చిన్న పార్టీ మున్సిపాలిటీని కైవసం చేసుకోవడం విశేషంగా మారింది. అలాగే చిట్యాలలో ట్రాన్స్‌జెండర్ అభ్యర్థి విజయం సాధించడం ఎన్నికల ప్రత్యేకతగా నిలిచింది. జోగులాంబ గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్‌బీ) పార్టీ మెజార్టీ స్థానాలను గెలుచుకుని మున్సిపాలిటీపై పట్టు సాధించింది. మొత్తం 10 వార్డుల్లో 8 వార్డులను ఆ పార్టీ అభ్యర్థులు దక్కించుకున్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ఒక్కో వార్డుకే పరిమితమయ్యాయి. స్థానికంగా తెలంగాణ జాగృతి నేతలు ఏఐఎఫ్‌బీ తరఫున బరిలోకి దిగడం ఈ విజయానికి కారణమని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రధాన పార్టీల మధ్య పోటీలో ఒక ప్రాంతీయ శక్తి మెజార్టీ సాధించడం ప్రత్యేకంగా చర్చకు దారితీసింది.

ఇక నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో ఒక చారిత్రాత్మక ఫలితం నమోదైంది. ఒకటో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ట్రాన్స్‌జెండర్ నాగిళ్ల సుధాకర్ 102 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఈ విజయం సామాజిక పరంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ప్రకటించిన ఫలితాలను పరిశీలిస్తే కాంగ్రెస్ 451 వార్డులు, బీఆర్‌ఎస్ 231, బీజేపీ 61, ఇతరులు 71 స్థానాలను గెలుచుకున్నారు. ఈ ఫలితాలు పట్టణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీసే అవకాశమున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags

Next Story