MUNCIPAL RESULT: ఉద్రిక్తతలు.. ఆందోళనలు.. నిరసనలు.. దాడులు

MUNCIPAL RESULT: ఉద్రిక్తతలు.. ఆందోళనలు.. నిరసనలు.. దాడులు
X
మంత్రి వివేక్ కాన్వాయ్‌పై రాళ్లు, చెప్పులతో దాడి.. స్వయంగా దాడి చేసిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్...అయిదు అంచెల భద్రత ఏర్పాటు చేసినా దాడి

తె­లం­గా­ణ­లో ము­న్సి­ప­ల్‌ మే­య­ర్‌, చై­ర్మ­న్‌, వై­స్‌ చై­ర్మ­న్‌ ఎన్ని­క­లు పలు జి­ల్లా­ల్లో తీ­వ్ర ఉద్రి­క్త­త­ల­కు దా­రి­తీ­శా­యి. అధి­కార కాం­గ్రె­స్‌, ప్ర­తి­ప­క్ష బీ­ఆ­ర్ఎ­స్‌ పా­ర్టీల మధ్య పో­టా­పో­టీ వా­తా­వ­ర­ణం నె­ల­కొ­న­డం­తో కొ­న్ని ప్రాం­తా­ల్లో పరి­స్థి­తి అదు­పు తప్పిం­ది. రా­ళ్ల­దా­డు­లు, తో­పు­లా­ట­లు, లా­ఠీ­చా­ర్జ్‌­ల­తో రా­జ­కీయ ఉద్రి­క్త­త­లు తా­రా­స్థా­యి­కి చే­రు­కు­న్నా­యి. ఒక సం­ద­ర్భం­లో మం­త్రి వి­వే­క్ వెం­క­ట­స్వా­మి కా­న్వా­య్‌­పై­నా దాడి జర­గ­డం పరి­స్థి­తి తీ­వ్ర­త­ను చా­టిం­ది. మం­చి­ర్యాల జి­ల్లా క్యా­త­న­ప­ల్లి ము­న్సి­పా­లి­టీ­లో చై­ర్మ­న్‌, వై­స్‌ చై­ర్మ­న్‌ ఎన్ని­కల నే­ప­థ్యం­లో ఉద్రి­క్త­త­లు చో­టు­చే­సు­కు­న్నా­యి. ఈ ము­న్సి­పా­లి­టీ­లో మొ­త్తం 22 వా­ర్డు­లు ఉం­డ­గా, బీ­ఆ­ర్ఎ­స్‌ 10, కాం­గ్రె­స్‌ 7, సీ­పీఐ 4, ఒక ఇం­డి­పెం­డెం­ట్‌ గె­లి­చా­రు. అద­నం­గా రెం­డు ఎక్స్‌ అఫి­షి­యో ఓట్లు ఉం­డ­టం­తో కాం­గ్రె­స్‌ బలం 10కి చే­రిం­ది. దీం­తో ఇరు పా­ర్టీ­లు ఈ స్థా­నా­న్ని దక్కిం­చు­కు­నేం­దు­కు వి­శ్వ­ప్ర­య­త్నా­లు ప్రా­రం­భిం­చా­యి. బీ­ఆ­ర్ఎ­స్‌ ఎమ్మె­ల్యే కోవా లక్ష్మి, మాజీ ఎమ్మె­ల్యే బా­ల్క సు­మ­న్‌­ల­ను పో­లీ­సు­లు అడ్డు­కు­న్నా­రు. 14 మంది కౌ­న్సి­ల­ర్ల­తో కలి­సి కా­ర్యా­ల­యం­లో­కి వె­ళ్లేం­దు­కు వారు ప్ర­య­త్నిం­చ­గా, ము­న్సి­ప­ల్‌ కా­ర్యా­ల­యం సమీ­పం­లో­ని పై­వం­తెన వద్ద పో­లీ­సు­లు ని­రో­ధిం­చా­రు. ఈ సం­ద­ర్భం­గా బీ­ఆ­ర్ఎ­స్‌, కాం­గ్రె­స్‌ శ్రే­ణుల మధ్య వా­గ్వా­దం చో­టు­చే­సు­కు­ని తో­పు­లా­ట­కు దారి తీ­సిం­ది. పరి­స్థి­తి ఉద్రి­క్తం­గా మా­ర­డం­తో పో­లీ­సు­లు లా­ఠీ­చా­ర్జ్‌ ని­ర్వ­హిం­చా­రు. దీ­ని­కి ఆగ్ర­హిం­చిన బీ­ఆ­ర్ఎ­స్‌ కా­ర్య­క­ర్త­లు అక్క­డి­కి వచ్చిన మం­త్రి వి­వే­క్ వెం­క­ట­స్వా­మి కా­న్వా­య్‌­పై­నా, పో­లీ­సు­ల­పై­నా రా­ళ్లు, చె­ప్పు­ల­తో దాడి చే­శా­రు. ఈ ఘట­న­లో మం­త్రి వా­హ­నం, పె­ద్ద­ప­ల్లి ఎంపీ వం­శీ­కృ­ష్ణ వా­హ­నాల అద్దా­లు ధ్వం­స­మ­య్యా­యి. కా­ని­స్టే­బు­ల్‌­తో పాటు మరో ఇద్ద­రు గా­య­ప­డ్డ­ట్లు సమా­చా­రం.పో­లీ­సు­లు ఐదు అం­చెల భద్ర­త­ను ఏర్పా­టు చేసి పరి­స్థి­తి­ని అదు­పు­లో­కి తీ­సు­కొ­చ్చా­రు.

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికల సందర్భంగా మరో ఘటన చోటుచేసుకుంది. క్యాంప్‌లో ఉన్న బీఆర్ఎస్‌ కౌన్సిలర్లు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం నుంచి బస్సు కాన్వాయ్‌తో తొర్రూరు వైపు బయలుదేరారు. అయితే అన్నారం సమీపంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌, పెద్ది సుదర్శన్‌రెడ్డిలను కూడా పోలీసులు నిలిపివేశారు. తొర్రూరు పట్టణ కేంద్రంలో సెక్షన్‌ 144 అమల్లో ఉందని, అనుమతి లేకుండా పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించరాదని పోలీసులు స్పష్టం చేశారు. మున్సిపల్‌ ఎన్నికలు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బలాబలాలు సమానంగా ఉన్న చోట్ల పోటాపోటీ వాతావరణం నెలకొనడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇరు పార్టీల నేతలు తమ ఆధిపత్యాన్ని చాటుకునేందుకు ప్రయత్నిస్తుండగా, పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. మొత్తంగా, మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికలు పలు ప్రాంతాల్లో రాజకీయ ఉద్రిక్తతలకు దారి తీసి రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చలకు కారణమయ్యాయి. పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేసి పరిస్థితిని అదుపులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మొత్తంగా రోజంతా తెలంగాణలో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది.

Tags

Next Story