Munugode: నా గెలుపును ఎవరూ ఆపలేరు: మునుగోడులో కేఏ పాల్

Munugode: నా గెలుపును ఎవరూ ఆపలేరు: మునుగోడులో కేఏ పాల్
Munugode: ఆయన అంతే. అదో టైపు. ఆయనే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. సమరమైనా.. సంబరమైనా కేఏ పాల్ చేయాలనుకున్నదే చేస్తాడు.

Munugode: ఆయన అంతే. అదో టైపు. ఆయనే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. సమరమైనా.. సంబరమైనా కేఏ పాల్ చేయాలనుకున్నదే చేస్తాడు. ఎన్నికల్లో గెలుపోటములతో పనిలేదు. కానీ.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఎన్నికలు జరిగినా బరిలో నేనూ ఉన్నానంటాడు.


ప్రత్యర్థి పార్టీలతో పోటీకి సై అంటాడు. వెంట భారీ క్యాడర్ ఉండదు. కానీ ఆయనే ఓ అట్రాక్షన్. పార్టీల నేతలు మాటలయుద్ధం చేస్తే.. కేఏ పాల్ మాత్రం తనదైన మాటలతో నవ్వులు పూయిస్తాడు.. వివాదాలు రేకెత్తిస్తాడు. అదేమంటే.. దటీజ్ కేఏ పాల్ అనుకునేలా చేస్తాడు. ఇక మునుగోడు బైపోల్‌లో ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా నిలబడిన కేఏ పాల్.. తగ్గేదేలేదంటూ సరికొత్త రీతిలో ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు.

మునుగోడులో ప్రచారం చేస్తున్న కేఏ పాల్.. డ్యాన్స్‌ చేసి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. మునుగోడు మండల వీధుల్లో ఓ పాటకు కేఏ పాల్ ఇరగదీసి వేసిన మాస్‌ స్టెప్పులను మీరే చూడండి..

కేఏ పాల్‌ మాంచి డ్యాన్సరే కాదు.. తనలో మరో యాంగిల్ కూడా ఉందంటున్నారు. అదే సీరియస్. నాతో కామెడీలు వద్దు. లిమిట్ దాడితే ఎదుటివాడు ఎవరనేది చూడను అన్నట్టు వార్నింగ్ ఇస్తారు. మొన్న మునుగోడులో పోలీసు అధికారులపైనే కేఏ పాల్ సీరియస్ అయ్యారు.


తానే కాబోయే తెలంగాణ ముఖ్యమంత్రి అంటూ వార్నింగ్ ఇచ్చారు. కాబోయే సీఎంతో ఎలా వ్యవహరించాలో తెలుసుకోండంటూ హెచ్చరించారు. అంతేకాదు.. ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి షేక్ హ్యాండ్ ఇచ్చారు. రాజగోపాల్‌రెడ్డితో కలిసి ప్రచారమూ చేసారు. ఇదంతా చూసిన జనం.. ఈయన కేఏ పాలేనా..? అని చర్చించుకునేలా చేసారు.

ఇక.. దీపావళి పండుగ రోజు కేఏ పాల్‌ మునుగోడులో చేసిన సందడి అంతా ఇంతా కాదు. తన ప్రచారమే డిఫరెంట్ అంటూ స్థానిక సెలూన్‌లో కటింగ్ చేయించుకున్నారు. ఇలా కూడా ఓటర్లను ఆకట్టుకోవచ్చు అనేలా వినూత్నంగా ప్రచారం చేశారు. అంతటితో ఆగని కేఏ పాల్.. అందరికీ స్వీట్లు, వాటర్‌ బాటిల్స్ పంచారు.


మునుగోడులో వార్ వన్‌ సైడ్‌ అయిపోయిందని జోష్యం చెప్పారు. మిగిలిన పార్టీలతో ఒరిగేదేం లేదని, బీజేపీ గూండాలు తనను చంపేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. తనకు ప్రజాదరణ ఉందని, మునుగోడులో తన గెలుపును ఎవరూ ఆపలేరని కేఏ పాల్ చెప్పడంతో బ్లాంక్ ఫేస్ పెట్టడం ప్రజల వంతైంది‌.

డ్యాన్సులు, సీరియస్సే కాదు.. రచ్చకైనా, రగడకైనా తాను సై అంటారు కేఏ పాల్. మునుగోడులో మామూలుగా ప్రచారం చేస్తే ఏమొస్తది కిక్కు అనుకున్నారో ఏమో.. చండూరులో కేఏ పాల్ ఓరేంజ్‌లో హల్‌చల్ చేశారు. డ్యూటీలో ఉన్న అధికారితో వాగ్వాదానికి దిగారు. పాల్‌కు చెందిన డీజే వాహనాన్ని అధికారి అడ్డుకున్నారు.


దాంతో నన్నే అపుతారా అంటూ ఏకంగా శివాలెత్తారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌ నా ఫోలోవర్‌ అంటూ రెచ్చిపోయారు. తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రిని తానేనంటూ అధికారిపై ఫైర్ అయ్యారు. అంతటి ఆగలేదు. అధికారి మెడలో ఉన్న ఐడీ కార్డు లాగే ప్రయత్నం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story