Munugode Bypoll: వేడెక్కుతున్న మునుగోడు రాజకీయాలు.. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పే పోస్టర్లు
Munugode Bypoll: మునుగోడు బైపోల్ హీటెక్కుతోంది. కర్ణాటక తరహాలో చండూరులో పోస్టర్లు వెలిశాయి. చండూరులో రాత్రికి రాత్రి ఫోన్‌పే తరహాలో కాంట్రాక్ట్ పే అంటూ మునుగోడులో నియోజక వర్గంలో భారీ సంఖ్యలో పోస్టర్లు దర్శనమిస్తున్నాయి.18000 కోట్ల కాంట్రాక్టులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికు కేటాయించారంటూ పోస్టర్లతో ప్రచారం చేస్తున్నారు.
గత కొంతకాలంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు రాజగోపాల్ రెడ్డి బీజేపీకి అమ్ముడు పోయాడని విమర్శలు చేస్తూ వస్తున్నారు.. అయితే ఇప్పుడు వేల సంఖ్యలో పోస్టర్లను కూడా వేయించారు. గత సెప్టెంబర్‌లో కర్ణాటకలో సీఎం బసవరాజ్ బొమ్మై టార్గెట్‌గా పేసీఎం'అంటూ పోస్టర్లు వెలిశాయి.
కర్ణాటక ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ఆరోపిస్తూ 40 శాతం కమీషన్ సర్కార్' పేరుతో పేసీఎం పోస్టర్లను కాంగ్రెస్ ప్రచురించింది. సీఎం బసవరాజ్ బొమ్మై ఫోటో, క్యూఆర్ కోడ్‌తో ఉన్న ఈ ఫోటోలు గోడలపై కన్పించడం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడు మనుగోడుకు కూడా కర్ణాటక గాలి సోకిందని స్థానికులు అంటున్నారు.
మునుగోడు నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ నెలకొంది. చండూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిప్పు పెట్టారు దుండగులు. ఈ ఘటనలో పార్టీ జెండాలు, కండువాలు దగ్ధమయ్యాయి. ఘటనపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. కుట్రపూరితంగానే తగులబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దీంతో పార్టీ ఆఫీస్ వద్దకు నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. కాగా ఇదే ప్రాంతంలో రాత్రికిరాత్రే రాజగోపాల్‌రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. ఆ క్రమంలోనే ప్రతీకార చర్యగా ఈ ఘటనకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు కాంగ్రెస్ నేతలు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com