Munugode: మునుగోడు ప్రచార బరిలోకి దిగుతున్న టీఆర్ఎస్ నేతలు..

Munugode: మునుగోడు ప్రచార బరిలోకి దిగుతున్న టీఆర్ఎస్ నేతలు..
Munugode: ఇవాళ్టి నుంచి మునుగోడు ప్రచార బరిలో దిగుతున్నారు టీఆర్‌ఎస్‌ నేతలు. 86 క్లస్టర్‌లుగా విభజించి బాధ్యతలు అప్పగించారు.

Munugode:ఇవాళ్టి నుంచి మునుగోడు ప్రచార బరిలో దిగుతున్నారు టీఆర్‌ఎస్‌ నేతలు. 86 క్లస్టర్‌లుగా విభజించి బాధ్యతలు అప్పగించారు. ఒక్కో ఎంపీటీసీ స్థానానికి ఇన్‌ఛార్జ్‌గా ఒక్కో ఎమ్మెల్యేను నియమించారు. మంత్రి కేటీఆర్‌కు గట్టుప్పల్‌ బాధ్యతలు, మంత్రి హరీష్‌రావుకు మర్రిగూడ బాధ్యతలు అప్పగించారు.

మునుగోడుకు జగదీష్‌రెడ్డి, బొడంగిపర్తి - కొప్పుల ఈశ్వర్‌, తాళ్లసింగారం - శ్రీనివాస్‌గౌడ్‌, ఆరెగూడెం - మల్లారెడ్డి, డి.నాగారం - ప్రశాంత్‌రెడ్డి, డీబీ పల్లి - నిరంజన్‌రెడ్డి, కోరిత్కల్ ‌- పువ్వాడ అజయ్‌, నాంపల్లి - తలసాని, పస్నూర్‌- సబితాఇంద్రారెడ్డి, పలివేలకు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని నియమించారు. 14 మంది మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించారు.

Tags

Read MoreRead Less
Next Story