Munugode: మునుగోడు ఉపఎన్నికలు.. ప్రధాన పార్టీల్లో కలవరం

Munugode: మునుగోడు ఉపఎన్నికలు.. ప్రధాన పార్టీల్లో కలవరం
Munugode: మునుగోడు ఉపఎన్నికను చూస్తుంటే సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమా చూసినట్లు ఉంది.ఎలాగైనా సీటు దక్కించుకోవాలనుకుంటున్న ప్రధాన పార్టీలు తమకున్న అన్నీ వనరులను ఉపమోగించుకుంటున్నాయి.

Munugode By-poll: మునుగోడు ఉపఎన్నికను చూస్తుంటే సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమా చూసినట్లు ఉంది.ఎలాగైనా సీటు దక్కించుకోవాలనుకుంటున్న ప్రధాన పార్టీలు తమకున్న అన్నీ వనరులను ఉపమోగించుకుంటున్నాయి.



మొన్నటి వరకు బోగస్ ఓటర్ల అంశంపై రచ్చ కొనసాగితే.. లేటెస్ట్‌గా అభ్యర్థులకు కేటాయిస్తున్న గుర్తులు పార్టీలను ఇబ్బంది పెడుతున్నాయి.. ఇక ఎంత మనీ ఇచ్చి కొన్నా తమతో చివరికంటా వుంటారో వుండరో తెలియని లోకల్ లీడర్స్, క్యాడర్స్.. దీనికి తోడు అందరి దగ్గర మనీ తీసుకుంటూ ఎవరు వస్తే వారి పాట పాడుతున్న ఓటర్లు.. ఇలా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను కలవరపాటుకు గురి చేస్తున్న అంశాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. దీంతో పార్టీలు కన్ఫ్యూజన్‌లో పడిపోతున్నాయి..

పార్టీల్లో కాంగ్రెస్ పార్టీది కాస్తంత భిన్నమైన పరిస్థితి. రాష్ట్రంలో అధికారంలో వున్న టీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ పోటాపోటీగా లోకల్ 'టాలెంట్'ని కొనుగోలు చేస్తుండగా ఏతావాతా కాంగ్రెస్ పార్టీనే ఈ విషయంలో మైనస్ అవుతున్న పరిస్థితి నెలకొంది.



ఇందుకు బూర నర్సయ్య గౌడ్ వ్యవహారాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నియోజకవర్గంలో దాదాపు 35 వేల ఓట్లున్న గౌడ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బూర నర్సయ్య టీఆర్ఎస్ పార్టీకి దూరం కాగానే గులాబీ పార్టీ అదే సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ నేత పల్లె రవికి గాలమేసింది. బూర ఇంకా బీజేపీలో చేరనే లేదు.. కానీ పల్లె రవిని పార్టీలోకి తీసుకుంది టీఆర్‌ఎస్.



కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి అలా ఉంటే టీఆర్ఎస్, బీజేపీలు ఎన్నికల గుర్తులు, జంప్ జిలానీలతో టెన్షన్‌ పడుతున్నారు. ఎంతో కొంత ఓటు బ్యాంకు చేతుల్లో వుందనుకున్న వార్డు మెంబర్ నుంచి జడ్పీటీసీ స్థాయి నేత దాకా లక్షలకు లక్షలు ఆఫర్ ఇచ్చి పార్టీలోకి ఆకర్షిస్తున్నారు. తీరా వారు పార్టీలో చేరినా పోలింగ్ ముగిసే దాకా తమతోనే వుంటారా లేరా అన్న డౌట్‌ మొదలైంది. ఇందుకు కారణం ఓ పేరున్న లీడర్లు సైతం పొద్దున్నా, సాయంత్రానికి పార్టీలు మారుతున్న పరిస్థితి మునుగోడులో కనిపిస్తోంది.



ఇక పెద్దగా పేరులేని వార్డు మెంబర్లు, ఎంపీటీసీల సంగతైతే చెప్పనక్కరే లేదు. ఈ నేపధ్యంలో ఒప్పందం చేసుకున్న మొత్తాన్ని ఒకే మొత్తంలో చెల్లించేందుకు అభ్యర్థులు, పార్టీలు ఇష్టం చూపించడం లేదు. ఎందుకంటే ఒకేసారి చెల్లించిన తర్వాత వారు పార్టీలో వుంటారో లేక మరింత మొత్తం ఇస్తామన్న మరో పార్టీలోకి జంప్ అవుతారో తెలియని పరిస్థితి. ఈక్రమంలో పార్టీలు మారిన జంప్ జిలానీలు కూడా తమకు పార్టీలు, అభ్యర్థులు ఇస్తామన్న మొత్తం ఎన్నికలయ్యే దాకా ఆగితే ఇస్తారో ఇవ్వరో అన్న అనుమానాలు ఉన్నాయి.



ఇక ఓటర్లు గుట్టుగా వ్యవహరిస్తుండడంతో కూడా వారి నాడి అర్థం కాక ప్రధాన పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. అందరి దగ్గరా మనీ తీసుకుంటాం కానీ ఎవరికి ఓటేయాలో వారికే వేస్తాం అంటున్న మునుగోడు ఓటర్ల వీడియోలు ఇపుడు సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతున్నాయి.

మరోవైపు మునుగోడు బై పోల్‌లో ధనం ప్రవాహంలా మారుతోంది. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ప్రలోభాల పర్వానికి తెరతీశారు. అప్పటికీ పోలీసులు కూడా ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. మునుగోడులో ప్రతి రోజు భారీగా నోట్ల కట్టలు పట్టుబడుతున్నాయి. చల్మడ చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు తనిఖీల్లో కోటి రూపాయలు పట్టుబడితే నిన్న గట్టుప్పల్‌ 19 లక్షలు పట్టుబడ్డాయిబెంగళూరు నుంచి కందుకూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో సరైన పత్రాలు లేకుండా తీసుకెళ్తున్న 14.50 లక్షల నగదు, బెంగళూరు నుంచి పామూరుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో 14 కర్ణాటక మద్యం సీసాలను పట్టుకున్నారు.ఇలా మనుగోడులో ధన ప్రవాహం సాగుతుంది.

Tags

Read MoreRead Less
Next Story